గృహ రుణంలో భాగస్వామ్యంతో ప్రయోజనం
సొంత ఇళ్లు అనేది ప్రతీ ఒక్కరి కల. మరి ప్ సొంత ఇంటిని సాకారం చేసుకోవాలనుకుంటే గృహ రుణానికి దాఖలు చేసేముందు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణంగా గృహ రుణ కాలపరిమితి రుణం తీసుకునే వారి వయసు, ఇతర అంశాలపై ఆధారపడి 10 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుంది. బ్యాంకులు, రుణ సంస్థలు వారి విధానాల ప్రాతిపదికన అర్హతను నిర్ణయిస్తాయి.
సొంత ఇళ్లు అనేది ప్రతీ ఒక్కరి కల. మరి ప్ సొంత ఇంటిని సాకారం చేసుకోవాలనుకుంటే గృహ రుణానికి దాఖలు చేసేముందు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణంగా గృహ రుణ కాలపరిమితి రుణం తీసుకునే వారి వయసు, ఇతర అంశాలపై ఆధారపడి 10 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుంది. బ్యాంకులు, రుణ సంస్థలు వారి విధానాల ప్రాతిపదికన అర్హతను నిర్ణయిస్తాయి.
కాలపరిమితి:
కాలపరిమితి కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఖాతాదారుడి వయసు, రుణ మొత్తం, ఆదాయం, ఉద్యోగం, క్రెడిట్ చరిత్ర వంటివి పరిశీలించిన తర్వాత ఎంత కాలపరిమితి ఇవ్వాలన్నది సంస్థలు నిర్ణయిస్తాయి. ఎక్కువకాలం గడువుతో ఎక్కువ రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. గడువు ముగియకముందే రుణం చెల్లించాలనుకుంటే ఆ అవకాశం కూడా ఉంటుంది. దీర్ఘకాలానికి ఈఎమ్ఐ తక్కువగా ఉంటుంది.
చట్టబద్దమైన లేదా సాంకేతిక పరిశీలన:
మీకు రుణ అర్హత ఉందని భావించిన తర్వాత సంస్థలు మీ ఆస్తిని చట్టపరంగా, సాంకేతికంగా పరిశీలన చేస్తుంది. ఇది మీకు రుణం ఇచ్చే బ్యాంకు లేదా సంస్థకే కాకుండా రుణం పొందేవారికి కూడా చాలా ముఖ్యమైన అంశం.
ప్రత్యేక ఆఫర్లు:
పండగ సీజన్లో గృహ రుణ దరఖాస్తులకు మంచి సమయం. ఈ సందర్భంగా బ్యాంకులు లేదా రుణ సంస్థలు పోటీపడి మరి వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులను తగ్గిస్తాయి. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న గృహ రుణ పథకాలు, సదుపాయాల గురించి కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ. 2.67 లక్షల వరక క్రెడిట్ సబ్సిడీ లభిస్తుంది. అన్ని పోల్చుచూసుకొని ఏ రుణం మీకు సరైనదో దానికి ప్రాధాన్యతనివ్వాలి.
సహ దరఖాస్తుదారుడు:
గృహ రుణం కోసం దాఖలు చేస్తున్నప్పుడు సహ దరఖాస్తుదారుడితో కలిపి చేసుకుంటే కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఉదాహరణకు రుణ అర్హత, ఈఎమ్ఐ, పన్ను మినహాయింపు వంటివి. ఇద్దరికి పన్ను మినహాయింపు లభిస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. మహిళలకు ఇంటి రుణంపై వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నందున మొదటిసారిగా గృహం కొనుగోలు చేస్తున్నవారు ఒక మహిళను రుణంలో మొదటి దరఖాస్తుదారుగా చేసుకుంటే వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. దీనికోసం మీ భార్య లేదా తల్లి, సోదరి, కూతురు వంటి ఎవరి పేరు అయినా చేర్చవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ