గృహ రుణం చెల్లించారా?

భ‌విష్య‌త్తులో ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్ల‌ను ఒక వేళ పెంచితే, మ‌ళ్ళీ త‌గ్గ‌డానికి కొన్ని నెల‌ల స‌మయం ప‌ట్ట‌వ‌చ్చు. ఈ పెర‌గ‌నున్న వ‌డ్డీ రేట్ల‌ను దృష్టిలో ఉంచుకుని గృహ‌రుణాల‌ను ముందుగా చెల్లించ‌వ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ఉన్న వారు కొంత వ‌ర‌కు చెల్లించ‌డం మంచిది.

Published : 23 Dec 2020 15:49 IST

భ‌విష్య‌త్తులో ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్ల‌ను ఒక వేళ పెంచితే, మ‌ళ్ళీ త‌గ్గ‌డానికి కొన్ని నెల‌ల స‌మయం ప‌ట్ట‌వ‌చ్చు. ఈ పెర‌గ‌నున్న వ‌డ్డీ రేట్ల‌ను దృష్టిలో ఉంచుకుని గృహ‌రుణాల‌ను ముందుగా చెల్లించ‌వ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ఉన్న వారు కొంత వ‌ర‌కు చెల్లించ‌డం మంచిది.

వ‌డ్డీ రేట్లు:
బ్యాంకులు వారి వారి ఎమ్‌సీఎల్ఆర్ కు అనుగుణంగా వ‌డ్డీ రేట్లును మార్పు చేస్తాయి. రానున్న రోజుల్లో వ‌డ్డీ రేట్లు పెరిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. కొత్త‌గా గృహ రుణం తీసుకునే వారికి కొత్త వ‌డ్డీ రేట్ల ఆధారంగా రుణ ల‌భ్య‌త ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు:

మీ గృహ రుణాల‌ను ర‌ద్దు చేసే ముందు ప్ర‌తీ సంవ‌త్స‌రం చెల్లించే గృహ‌రుణం అస‌లు, వ‌డ్డీల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవాలి. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద వార్షికంగా గృహ రుణ అస‌లు చెల్లింపుపై వార్షికంగా.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. సెక్ష‌న్ 24(బీ) కింద గృహ‌రుణ వ‌డ్డీ చెల్లింపుపై రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

అయితే సెక్ష‌న్ 80సీ కింద మిన‌హాయింపు పొంద‌డానికి ఉద్యోగ భ‌విష్య‌నిధి, ఇన్సురెన్స్ పాల‌సీలు, పిల్లల ట్యూష‌న్ ఫీజులు, ఈక్విటీ ఆధారిత పొథ‌కాల‌లో మ‌దుపు చేయ‌డం వంటి అందుబాటులో ఉన్నాయి. కానీ సెక్ష‌న్ 24(బీ) ప్ర‌కారం గృహ రుణంపై చెల్లించే వ‌డ్డీకి మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

గ‌రిష్ట ప‌న్ను (30శాతం) ప‌రిధిలో ఉన్న వారైతే పెరగ‌నున్న వ‌డ్డీ రేట్ల ప్ర‌భావంతో ఆదాయ‌పు ప‌న్ను 9 శాతం వ‌ర‌కు క‌ట్ట‌వ‌ల‌సి ఉంటుంది. గృహ రుణంపై వ‌డ్డీ చెల్లింపులో ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం 6.2 శాతానికి త‌గ్గిస్తుంది. త‌క్కువ ప‌న్ను ప‌రిధిలో ఉన్న వారిపై పెరిగిన వ‌డ్డీ రేట్ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. గృహ రుణం ర‌ద్దు చేసుకునే ముందు మీ ఆదాయ‌పు ప‌న్ను స్లాబ్‌ను అనుస‌రించి గృహ రుణం చెల్లించాలా?కొన‌సాగించాలా? అనేది నిర్ణ‌యించుకోవాలి.

పన్ను ప్రయోజనాలు తగినంతగా ఉన్నాయా?

ఆర్ధిక నిపుణులు సూచించిన ప్ర‌కారం మీకు గృహ రుణం చెల్లించ గ‌ల సామ‌ర్ధ్యం ఉన్న‌ప్ప‌టికి, కేవ‌లం ప‌న్ను మిన‌హాయింపు కోసం చెల్లించ‌కుండా ఉంచిన‌ట్ల‌యితే మీరు పొందే ప‌న్ను మిన‌హాయింపు కంటే మీరు చెల్లించ‌వ‌ల‌సిన వ‌డ్డీ అధికంగా వుంటుంది. ఈఎమ్ఐ ద్వారా రుణం చెల్లిస్తున్న‌ట్ల‌యితే అదే మొత్తాన్ని ప్ర‌తీ నెలా సిప్ విధానంలో దీర్ఘ‌కాలిక ఈక్విటీ ఫండ్లో మ‌దుపు చేయ‌వ‌చ్చు. ఈ విధంగా మ‌దుపు చేయ‌డం ద్వారా వ‌చ్చే రాబ‌డి చెల్లించే వ‌డ్డీ రేటు కంటే అధికంగా ఉంటుంది.

మీ వ‌ద్ద ఉన్న అద‌న‌పు నిధుల‌ను దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌యిన ఈక్విటీ ఫండ్ల‌లో పెడితే 12 శాతం వ‌ర‌కు రాబ‌డి ఉంటుంది. ఇది గృహం రుణంపై వుండే వ‌డ్డీ రేటు 8.5-9 శాతం కంటే కూడా ఎక్కువ.ఈక్విటీ మ్యూచువ‌ల్ లేదా డైరెక్ట్ ఈక్విటీల‌లో దీర్ఘ‌కాలానికి పెట్టుబ‌డి పెట్టేవారైతే గృహ రుణం మొత్తం ఒకేసారి చెల్లించ‌క పోవ‌డ‌మే మంచిది.

కొంత రుణం చెల్లిచ‌డం ద్వారా:

గృహ రుణ వ‌డ్డీపై రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు వార్షికంగా ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి అంత‌వ‌ర‌కు రుణం ఉంచి, మిగిలిన రుణాన్ని తిరిగి చెల్లించినట్ల‌యితే ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు పొంద‌డంతో పాటు కొంత వ‌ర‌కు అదిక వ‌డ్డీ రేట్ల భారీ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. మిగిలిన మొత్తాన్ని దీర్ఘ‌కాలిక ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడితే అదిక ప్ర‌యోజ‌నం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని