రుణం తీసుకుంటున్నారా? అయితే మీ ఎఫ్ఓఐఆర్ గురించి తెలుసుకోండి?

రుణం మంజూరు చేసేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, డిజిట‌ల్ రుణ‌దాత‌లు, వివిధ ర‌కాలుగా రుణ‌గ్ర‌హీత అర్హ‌త‌ల‌ను అంచ‌నా వేస్తుంటారు. అందులో భాగంగా కేవైసీ ప్ర‌తాల ద్వారా రుణ గ్ర‌హీతల విశ్వ‌స‌నీయ‌త‌, క్రెడిట్ చ‌రిత్ర‌, ప్ర‌స్తుత ఆస్తి, అప్పుల వివ‌రాలు, ఆర్థికంగా వారికి ఉన్న భాద్య‌త‌లు, తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యం వంటి వాటిని ప‌రిగ‌ణ‌లోనికి

Published : 23 Dec 2020 15:52 IST

రుణం మంజూరు చేసేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, డిజిట‌ల్ రుణ‌దాత‌లు, వివిధ ర‌కాలుగా రుణ‌గ్ర‌హీత అర్హ‌త‌ల‌ను అంచ‌నా వేస్తుంటారు. అందులో భాగంగా కేవైసీ ప్ర‌తాల ద్వారా రుణ గ్ర‌హీతల విశ్వ‌స‌నీయ‌త‌, క్రెడిట్ చ‌రిత్ర‌, ప్ర‌స్తుత ఆస్తి, అప్పుల వివ‌రాలు, ఆర్థికంగా వారికి ఉన్న భాద్య‌త‌లు, తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యం వంటి వాటిని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుంటారు. అయితే అన్నింటికంటే ముఖ్యంగా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యం ఆధారంగా రుణం మంజూరు చేస్తారు.

ఎఫ్ఓఐఆర్ అంటే ఏమిటి? దీని ద్వారా రుణం తిరిగి చెల్లించే సామ‌ర్ధాన్ని ఏవిధంగా అంచ‌నా వేయ‌వ‌చ్చు? ఆదాయ రుణ చెల్లింపు నిష్ప‌త్తి (ఎఫ్ఓఐఆర్ ) అనేది బ్యాంకులు/ ఎన్‌బీఎఫ్‌సీలు రుణ అర్హతను లెక్కించేందుకు ఉపయోగించే ముఖ్యమైన పారామీటర్. ఇది రుణగ్రహీత నెలవారీ ఆదాయం, డెట్‌, ఈఎమ్ఐ వంటి నెల‌వారీ స్థిర ఖ‌ర్చులు అనుస‌రించి నిర్ణ‌యిస్తారు. ఒక వేళ రుణం మంజూరు అయితే చెల్లించ‌వ‌ల‌సిన ఈఎమ్ఐను కూడా నెల‌వారీ చెల్లింపుల‌కు జోడించి ఎఫ్ఓఐఆర్‌ను లెక్కిస్తారు. ప‌న్ను, పెట్టుబ‌డి, బీమా, రిక‌రింగ్ డిపాజిట్ల వంటి చ‌ట్ట‌బ‌ద్ద‌మైన చెల్లింపు(స్టేట్యుట‌రీ డిడ‌క్ష‌న్‌)ల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోరు.

ఉదాహ‌ర‌ణ‌: విన‌య్ అనే 28 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల‌ వ్య‌క్తి నెల‌కు రూ. 30 వేలు సంపాదిస్తున్నాడు. అత‌ను నెలకు రూ. 7,780 కారు రుణ ఈఎమ్ఐ చెల్లిస్తున్నాడు. గృహ రుణ ఈఎమ్ఐ నెల‌కు రూ. 10 వేలు. మొత్తం క‌లిపి ప్ర‌స్తుతం విన‌య్ చెల్లించ‌వ‌ల‌సిన రుణం నెల‌కు రూ. 17,780. ప్ర‌స్తుతం ద‌ర‌ఖాస్తు చేసుకున్న రుణ ఈఎమ్ఐతో క‌లిపి రుణ చెల్లింపులు, మొత్తం ఆదాయంలో 50 శాతానికి మించి ఉండ‌కూడ‌దు. రుణాలు మంజూరు చేసే సంస్థ‌ల ప్ర‌కారం ఒక వ్య‌క్తి ఆదాయంలో క‌నీసం 45 నుంచి 50 శాతం ఆదాయం అత‌ను నెల‌వారీ ఖ‌ర్చుల‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది.

విన‌య్ ఇప్ప‌టికే తీసుకున్న రుణ ఈఎమ్ఐ అత‌ని ఆదాయంలో 50 శాతానికి మించి ఉండ‌డం వ‌ల్ల , అత‌ను ద‌ర‌ఖాస్తు చేసుకున్న సెక్యూరిటీ లేని రుణాల‌ను తిర‌స్క‌రించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది.

ఒక వ్య‌క్తి అన్ని రుణ చెల్లింపుల‌ను, అత‌ని మొత్తం ఆదాయం నుంచి తీసివేసి ఎఫ్ఓఐఆర్‌ను లెక్కిస్తారు

ఎఫ్ఓఐఆర్‌= అన్ని రుణ వాయిదాల మొత్తం/ నెల‌వారీ ఆదాయం

రుణం ఏవిధంగా పొందాలి?

అధిక ఎఫ్ఓఐఆర్‌తో క్రెడిట్ లైన్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న వారికి సెక్యూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేయ‌డం అనేది రిస్క్‌తో కూడిన‌ప‌ని. అందువ‌ల్ల సెక్యూరిటీ ఉన్న రుణాల‌తో పోలిస్తే సెక్యూరిటీ లేని రుణాల‌కు ఆమోద ప్ర‌క్రియ కఠినంగా ఉంటుంది. అయితే రుణం తీసుకున్న వ్య‌క్తి అదే క్రెడిట్ లైన్‌తో, అప్ప‌టికే ఉన్న రుణాల నుంచి ఒక‌టి, అంత‌కంటే ఎక్కువ రుణాల‌ను చెల్లించినా, లేదా అత‌ని ఆదాయాన్ని పెంచుకున్నా అత‌ను రుణం పొందేందుకు అర్హ‌త పొంద‌వ‌చ్చు. త‌క్కువ ఎఫ్ఓఐఆర్‌తో, ఎక్కువ క్రెడిట్ స్కోర్‌తో రుణం పొందే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.
బ్యాంక‌లు, ఆర్థిక సంస్థ‌లు రుణ‌ ద‌ర‌ఖాస్తు, ఎంక్వైరీ నిమిత్తం క్రెడిట్ బ్యూరో వారిని సంప్ర‌దిస్తాయి. ఈ విచారణలు రుణగ్రహీత క్రెడిట్ స్కోరుపై ఆధార‌ప‌డ‌తాయి. అందువ‌ల్ల రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేముందు మీ ఎఫ్ఓఐఆర్‌ను లెక్కించి ముంద‌డుగు వేయ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని