గృహ రుణం పొందేందుకు కావలసిన అర్హతలు ఏంటి?
గృహ రుణం తీసుకుని, ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రాణాళిక సిద్ధంచేసుకుంటున్నారా? వివిధ అంశాలను అనుసరించి వ్యక్తి రుణ అర్హతను అంచనా వేస్తారు. మీ వయసు, ఆర్థక స్థితిగతులు, ఇప్పటికే ఉన్న రుణాలు, నిర్ధిష్ట కాలవ్యవధిలో తిరిగి చెల్లించే సామర్ధ్యం వంటి వాటిని పరిగణలోనికి తీసుకుని, రుణ దరఖాస్తును ఆమోదిస్తారు.
గృహ రుణం తీసుకుని, ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రాణాళిక సిద్ధంచేసుకుంటున్నారా? వివిధ అంశాలను అనుసరించి వ్యక్తి రుణ అర్హతను అంచనా వేస్తారు. మీ వయసు, ఆర్థక స్థితిగతులు, ఇప్పటికే ఉన్న రుణాలు, నిర్ధిష్ట కాలవ్యవధిలో తిరిగి చెల్లించే సామర్ధ్యం వంటి వాటిని పరిగణలోనికి తీసుకుని, రుణ దరఖాస్తును ఆమోదిస్తారు.
ఆర్థిక స్థిరత్వం:
ప్రాధానంగా, మీ ప్రస్తుత, భవిష్యత్తు ఆదాయాలను పరిగణలోనికి తీసుకుని బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తుంటాయి. ఒక క్రమమైన ఆదాయం లేని నిరుద్యోగల కంటే, ఉద్యోగం చేస్తూ ఒక క్రమమైన ఆదాయం పొందుతున్న వారికి గృహ రుణాలను మంజూరు చేసేందుకు రుణదాతలు ఆసక్తి చూపుతారు. ఉద్యోగంలో చేరి కనీసం ఒక సంవత్సర కాలం పూర్తైన అనంతరం మాత్రమే రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉపాది రికార్డులను పరిశీలించేందుకు గానూ, వేతన చెల్లింపు పత్రాలు(పే-స్లిప్స్), టీడీఎస్ మినహాయింపు పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్లు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కంపెనీ వ్యవస్థాకుడు, ప్రోఫెషనల్ అయితే బ్యాంకు స్టేట్మెంట్, ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించిన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
వయసు:
గృహ రుణ మంజూరుకు వయసు కూడా ఒక ముఖ్యమైన అంశం. గరిష్టంగా 30 సంవత్సరాలు లేదా పదవీ విరమణ వరకు బ్యాంకులు, హెచ్ఎఫ్సీలు తిరిగి చెల్లింపులను అనుమతిస్తాయి. సీనియర్ల కంటే యువ దరఖాస్తు దారులు ఎక్కువ కాలం ఉపాదిలో కొనసాగే అవకాశం ఉండడం వల్ల తక్కవ వయసు ఉన్న వ్యక్తులకు తిరిగి చెల్లించేందుకు ఎక్కువ సమయం ఉంటుంది. వయసు ఎక్కువ ఉన్న వారికి పదవీ విరమణ తరువాత ఒక క్రమమైన ఆదాయం ఉండదు కాబట్టి గృహ రుణ చెల్లింపుల కాలపరిమితి తక్కువగా ఉంటుంది.
క్రెడిట్ స్కోర్:
రుణ తిరిగి చెల్లింపుల చరిత్రను, విధానాలను విశ్లేషించడానికి సిబిల్ వంటి స్వతంత్ర క్రెడిట్ సమాచార బ్యూరోలను బ్యాంకులు సంప్రదిస్తాయి. 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారితో పోలిస్తే తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారికి రుణం లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. క్రెడిట్ కార్డుల అధిక వినియోగం, ఆలస్యంగా చెల్లింపులు చేయడం వంటివి మీ స్కోర్‌ను తగ్గిస్తాయి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నవారికి సక్రమంగా రుణాలు చెల్లించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నందున, అటువంటి వారికి బ్యాంకులు అధిక ప్రాధాన్యత ఇస్తాయి.
ఇతరులకు హామీ ఇస్తే:
మీరు ఇదివరకే రుణం తీసుకున్న వ్యక్తికి, హామీగా వ్యవహరిస్తే, ఆ రుణం మీరు తీసుకున్నట్లుగా పరిగణించి, మీ పేరుతో మరొక రుణం మంజూరు చేసేందుకు రుణదాతలు ఆసక్తి చూపరు. అంతేకాకుండా మీరు హామీ ఇచ్చిన వ్యక్తి వాయిదాలను సరైన సమయంలో చెల్లించకపోతే అది మీ క్రెడిట్ విశ్వశనీయతపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల మీరు యుక్తవయసులో ఉన్నా, హామీ కోరే వ్యక్తిని గురించి పూర్తిగా తెలియకపోయినా, ఇతరులు తీసుకునే రుణాలకు హామీ ఇవ్వకపోవడమే మంచింది.
చెల్లించాల్సిన రుణాలు :
కారు రుణం, అధిక క్రెడిట్ కార్డుడెట్ వంటివి, మీకు ఇప్పటికే ఉంటే గృహ రుణాన్ని పొందడం కష్టం అవుతుంది. ఇప్పటికే తీసుకున్న రుణంతో పాటు కొత్తగా రుణం తీసుకుంటే తిరిగి చెల్లించడం రుణ గ్రహీతకు భారం కావచ్చనే ఉద్దశ్యంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్