టాప్ అప్ రుణంపై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చా?

సాధార‌ణంగా గృహ‌రుణాలపై ప‌న్ను మిన‌హాయింపులు ఉంటాయి. ప్ర‌తీ సంవత్స‌రం ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద అస‌లు చెల్లింపుపై ప‌న్నుమిన‌హాయింపు, సెక్ష‌న్ 24 కింద రూ.2 ల‌క్ష‌లు వ‌డ్డీ పై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. వీటితో పాటు వేరే విధంగా గృహ‌రుణంపై ప‌న్ను మిన‌హాయింపు

Published : 23 Dec 2020 13:54 IST

సాధార‌ణంగా గృహ‌రుణాలపై ప‌న్ను మిన‌హాయింపులు ఉంటాయి. ప్ర‌తీ సంవత్స‌రం ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద అస‌లు చెల్లింపుపై ప‌న్నుమిన‌హాయింపు, సెక్ష‌న్ 24 కింద రూ.2 ల‌క్ష‌లు వ‌డ్డీ పై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. వీటితో పాటు వేరే విధంగా గృహ‌రుణంపై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌డం కుదురుతుంది. ఇప్ప‌టికే తీసుకున్న‌ గృహ రుణంపై టాప్ అప్ లోన్ ద్వారా ప‌న్నుమిన‌హాయింపును క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఇంటి మ‌ర‌మ్మ‌త్తులు లేదా అద‌న‌పు సౌక‌ర్యాల కోసం అప్ప‌టికే గృహ‌రుణం తీసుకున్న దానిపై అద‌నంగా తీసుకునే రుణాన్ని టాప్ అప్ లోన్ అంటారు. వ్య‌క్తిగ‌త రుణాల‌తో పోలిస్తే టాప్ అప్ లోన్ పై వ‌ర్తించే వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా ఉంటుంది. టాప్ అప్ లోన్ ద్వారా తీసుకున్న మొత్తాన్ని ఇంటి సంబంధిత ప‌నుల‌కు వినియోగించిన‌ట్లు ధ్రువ‌ప‌త్రాలు ఉంటే ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

సాధార‌ణంగా ఇంటి రుణం చెల్లింపుల్లో వ‌డ్డీ భాగం పై రూ.2 ల‌క్ష‌లు మిన‌హాయింపు ఉంటుంది. టాప్ అప్ లోన్ తో అద‌నంగా రూ. 30,000 పొంద‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు వ‌డ్డీ చెల్లింపు మొత్తం రూ. 32,000 అయితే, మొత్తం ప‌రిమితి రూ. 30,000 వ‌ర‌కూ ఉంటుంది. దీన్ని మొత్తం ప‌రిమితి రూ. 2,00,000- రూ. 30,000=రూ. 170000. రెగ్యుల‌ర్ విధానంలో వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపు 1.7 ల‌క్ష‌లు ఉంటుంది . మొత్తం వ‌డ్డీ పై ప‌న్ను మిన‌హాయింపు రెగ్యుల‌ర్, టాప్ అప్ రెండింటిని క‌లిపితే రూ.2 ల‌క్ష‌లకు మించ‌కూడ‌దు. ప‌న్నుకు సంబంధించి స‌ర్దుబాట్ల‌ను ఎనిమిది సంత్స‌రాల‌ వ‌ర‌కూ క్యారీ ఫార్వ‌ర్డ్ చేసుకోవ‌చ్చు. స్వ‌యంగా ఆ ఇంట్లో ఉంటే ప‌రిమితి రూ.30 వేలు ఉంది.

అద్దెకు ఇచ్చిన ఇంటికి మ‌ర‌మ్మ‌త్తులు ఏవైనా చేసేందుకు టాప్ అప్ రుణం తీసుకుంటే ప‌రిమితి ఉండ‌దు. మొత్తం ప‌రిమితి రూ.2 ల‌క్ష‌లకు మించ‌కూడ‌దు. ప‌న్నుకు సంబంధించి స‌ర్దుబాట్ల‌ను ఎనిమిది సంత్స‌రాల‌ వ‌ర‌కూ క్యారీ ఫార్వ‌ర్డ్ చేసుకోవ‌చ్చు.

ప‌న్ను ప్ర‌కారం, అస‌లుపై పన్ను ప్రయోజనం నిధుల వినియోగానికి అనుగుణంగా ఉంటుంది. కొత్త ఆస్తుల నిర్మాణం లేదా కొనుగోలు కోసం నిధులను ఉపయోగించినట్లయితే, అస‌లు,వడ్డీ సెక్షన్ 80సీ, 24 బీ ప్ర‌కారం మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

నిధులను మరమ్మత్తులు, పునర్నిర్మాణం కోసం నిధులు ఉపయోగించినట్లయితే, వాటిని అస‌లు చెల్లింపుగా ప‌రిగ‌ణించ‌రు. టాప్ అప్ లోన్ ద్వారా తీసుకున్న మొత్తాన్ని వినియోగిస్తేనే ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఇత‌ర అవ‌స‌రాల‌కు వినియోగిస్తే ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తించ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని