మీ రుణ ఈఎంఐలను తగ్గించుకోండిలా..

ప్రతి నెలా ఎలాంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేకపోతే జీవితం ఎంత బావుంటుందోనని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ రుణ రహిత జీవితాన్ని సాగించడం సాధ్యమేనా? మనలో చాలామంది కారు రుణం, విద్యా రుణం, వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ మొదలైన

Published : 23 Dec 2020 15:51 IST

ప్రతి నెలా ఎలాంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేకపోతే జీవితం ఎంత బావుంటుందోనని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ రుణ రహిత జీవితాన్ని సాగించడం సాధ్యమేనా? మనలో చాలామంది కారు రుణం, విద్యా రుణం, వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ మొదలైన వాటి భారాన్ని మోస్తూ ఉంటారు. చాలా ప్రముఖమైన, నిరూపితమైన ‘డెట్ స్నోబాల్ మెథడ్’ అని పిలిచే పద్ధతిని అనుసరించడం ద్వారా రుణ రహిత జీవితాన్ని పొందవచ్చు. దానికి మనం అనుసరించాల్సిన పద్ధతి గురించి కింద తెలుసుకుందాం.

డెట్ స్నోబాల్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?

డెట్ స్నోబాల్ అంటే ఒక క్రమ పద్ధతిలో చిన్న రుణాల చెల్లింపును మొదలుకొని పెద్ద రుణాల చెల్లింపును పూర్తి చేయడం. సాధారణంగా మనలో చాలామంది ఎక్కువ వడ్డీ రేటు కలిగిన రుణాన్ని ముందుగా చెల్లించి దాని నుంచి బయటపడాలని అనుకుంటారు. కానీ మీ రుణాల సంఖ్యను తగ్గించడానికి మీరు మొదటగా చిన్న రుణాలను చెల్లించటం మొదలు పెట్టాలి. అయితే, ఈ రెండింటిలో ఏ పద్ధతి మీకు ఎక్కువ మొత్తాన్ని ఆదా చేస్తుంది? ఒకవేళ మీరు పెద్ద రుణాన్ని చెల్లించడం ప్రారంభించినట్లయితే, బహుశా మీరు గణనీయమైన పురోగతిని సాధించలేరని, మొత్తం తిరిగి చెల్లింపు దాదాపు పూర్తి అయ్యే సమయానికి ముందు నిష్క్రమించే అవకాశం కూడా ఉంటుందని మీరు అనుకోవచ్చు.

దాని కోసం మీరు ఏం చేయాలంటే...

(i) మీ మొత్తం రుణాలను చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు జాబితాను తయారు చేయండి.
(ii) చిన్న రుణాలకు తప్ప మిగిలిన అన్ని రుణాలకు కనీస చెల్లింపు చేయండి.
(iii) మీరు చిన్న రుణాలపై వీలయ్యేంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించండి.
(iv) రుణానికి సంబంధించిన తిరిగి చెల్లింపు పూర్తయ్యే వరకు పునరావృతం చేయండి.
(v) ఒకవేళ మీరు ఇతర మార్గాల ద్వారా అదనపు నగదును పొందినట్లైతే, సదరు మొత్తాన్ని చిన్న రుణాన్ని చెల్లించడానికి ఉపయోగించండి.

ఇది ఎలా పని చేస్తుందో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం..

ఉదాహరణకు మీకు నాలుగు రకాల రుణాలు ఉన్నాయనుకుందాం..

a) క్రెడిట్ కార్డు 1: మీ క్రెడిట్ కార్డు మొత్తం అవుట్ స్టాండింగ్ రూ. 25,000 అనుకుంటే, 18 శాతం వడ్డీతో నెలకు రూ. 1,250 చెల్లించాలి.
బి) క్రెడిట్ కార్డు 2 : మీ క్రెడిట్ కార్డు మొత్తం అవుట్ స్టాండింగ్ రూ. 50,000 అనుకుంటే, 24 శాతం వడ్డీతో, నెలకు రూ. 2,500 చెల్లించాలి.
c) కారు రుణం : కారు రుణం రూ. 3,00,000 అనుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో, నాలుగు సంవత్సరాల కాలానికి గాను నెలకు ఈఎంఐ కింద రూ. 6,750 చెల్లించాల్సి ఉంటుంది.
డి) విద్యా రుణం: విద్యా రుణం రూ. 7,50,000 అనుకుంటే, 5 శాతం వడ్డీ రేటుతో 10 సంవత్సరాల కాలానికి గాను నెలకు ఈఎంఐ కింద రూ. 7,950 చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు, మీరు ప్రతి అవుట్ స్టాండింగ్ రుణంపై కనీస మొత్తాన్ని చెల్లిస్తున్నారని, అలాగే తక్కువ అవుట్ స్టాండింగ్ గల క్రెడిట్ కార్డుకు అదనంగా రూ. 5000 చెల్లించారని అనుకుందాం, మీరు దాన్ని నాలుగు నెలల్లో చెల్లించాలి. అప్పుడు మీరు రెండవ క్రెడిట్ కార్డుకు నెలకు రూ. 8750 (రూ. 5000 + రూ. 1,250 + మీరు ఇప్పటికే చేస్తున్న రూ. 2500 చెల్లింపు) వరకు చెల్లించవచ్చు. అప్పుడు అది ఐదు నెలల్లో అయిపోతుంది. ఇప్పుడు మీరు రూ. 15,500 (రూ. 8,750 + రూ. 6,750) కారు రుణానికి చెల్లించాలి. అప్పుడు కారు రుణం 15 నెలల్లో పూర్తవుతుంది.

మీరు విద్యా రుణంలోకి వచ్చే సమయానికి ప్రతి నెలా రూ. 23,450 చెల్లించాలి. ఈ విధంగా చెల్లించడం ద్వారా మీరు మరొక 24 నెలల్లో అన్ని రుణాలకు వీడ్కోలు చెప్పి, పూర్తి రుణ విముక్తిని పొందుతారు. మీరు ముందుగా చిన్న రుణాలను చెల్లించడం ప్రారంభించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అయితే, అధిక వడ్డీ కలిగిన రుణాన్ని చెల్లించడంలో మీరు ఆలస్యం చేసినట్లయితే, మరింత డబ్బును వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని