ఈఎమ్ఐపై వ‌డ్డీ రేటు ప్ర‌భావం

ప్ర‌తీ ఒక్క‌రికీ సొంత ఇల్లు నిర్మించుకోవాల‌నే క‌ల ఉంటుంది. ప్ర‌స్తుత కాలంలో యువ‌త సైతం, సొంత ఇంటి య‌జ‌మానులు కావ‌డానికి గృహ రుణాలు ఎంత‌గానో దోహ‌దం చేస్తున్నాయి. ఇల్లు కొనుగోలు దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి. అందువ‌ల్ల ఆర్థిక సంస్థ‌లు వివిధ ర‌కాలైన వ‌డ్డీరేట్ల‌ను అందిస్తున్నాయి. అయితే

Published : 23 Dec 2020 15:51 IST

ప్ర‌తీ ఒక్క‌రికీ సొంత ఇల్లు నిర్మించుకోవాల‌నే క‌ల ఉంటుంది. ప్ర‌స్తుత కాలంలో యువ‌త సైతం, సొంత ఇంటి య‌జ‌మానులు కావ‌డానికి గృహ రుణాలు ఎంత‌గానో దోహ‌దం చేస్తున్నాయి. ఇల్లు కొనుగోలు దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి. అందువ‌ల్ల ఆర్థిక సంస్థ‌లు వివిధ ర‌కాలైన వ‌డ్డీరేట్ల‌ను అందిస్తున్నాయి. అయితే ఈ వ‌డ్డీ రేట్ల‌లో 0.25 శాతం వ్య‌త్యాసం వ‌ల్ల మొత్తం వ్య‌యంలో ఎంత హెచ్చుత‌గ్గులు ఉంటాయో విశ్లేషించాలి. వ‌డ్డీ రేటు 0.25 శాతం త‌గ్గితే మీరు చెల్లించే ఈఎమ్ఐ విలువ దీర్ఘ‌కాలంలో అధిక మొత్తంలో త‌గ్గుతుంది.

ఈ కింది ప‌ట్టిక వివిధ కాల‌ప‌రిమితులకు, వివిధ వ‌డ్డీ రేట్ల కార‌ణంగా ఈఎమ్ఐలో వ్య‌త్యాసాన్ని సూచిస్తుంది.

ప‌ట్టిక‌ I:

ఉదాహ‌ర‌ణ‌కి: ఎక్స్ అనే వ్య‌క్తి 10 సంవత్స‌రాల‌ (120 నెల‌లు) కాల‌ప‌రిమితికి, 8 శాతం వార్షిక వ‌డ్డీ చొప్పున రూ. 10 ల‌క్ష‌లు గృహ రుణం తీసుకుంటే, అత‌ను చెల్లించ‌వ‌ల‌సిన ఈఎమ్ఐ నెల‌కు రూ. 12,133. ఈ మొత్తం కాల‌ప‌రిమితికి ఎక్స్ చెల్లించే మొత్తం వ‌డ్డీ రూ. 4,55,931. ఒక‌వేళ ఎక్స్ సంవ‌త్స‌రానికి 8 శాతం బ‌దులుగా 8.25 శాతం వ‌డ్డీకి గృహ రుణం తీసుకుంటే అత‌ను చెల్లించ‌వ‌ల‌సిన ఈఎమ్ఐ రూ. 12,265, అంటే అత‌ను చెల్లించే ఈఎమ్ఐ నెల‌కు రూ.133 పెరుగుతుంది. మొత్తం కాలానికి రూ. 4,71,832 వ‌డ్డీ చెల్లించాలి.

ప‌ట్టిక‌ II:

ప‌ట్టిక‌ III:

వ‌డ్డీ రేటు 0.25 శాతం త‌గ్గ‌డం వ‌ల్ల నెల‌వారీ ఈఎమ్ఐ వ్య‌త్యాసం రూ. 133ను 7 శాతం వ‌డ్డీ చొప్పున 120 నెల‌ల‌కు పెట్టుబడి పెడితే, వ‌చ్చే మొత్తం రాబ‌డి రూ. 22,850. ఇది దాదాపు రెండు నెల‌ల ఈఎమ్ఐకు స‌మానం. నెల‌వారీ ఈఎమ్ఐలో ఉండే వ్య‌త్యాసం రూ. 133 ను 12శాతం వ‌డ్డీ చొప్పున 120 నెల‌ల‌కు పెట్టుబ‌డి పెడితే వ‌చ్చే వ‌డ్డీ మొత్తం రాబ‌డి రూ. 30,500. ఇది దాదాపు 2.5 నెల‌ల ఈఎమ్‌కు స‌మానం.

ప‌ట్టిక‌ IV:

రూ.15 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల 10,15,20,25 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితుల‌కు 8,8.25,8.50,8.75 శాతం వ‌డ్డీ రేట్ల‌తో ఈఎమ్ఐలో ఉండే వ్య‌త్యాసాన్ని 7, 12 శాతం వ‌డ్డీరేట్ల‌తో పెట్టుబ‌డి పెడితే వ‌చ్చే రాబ‌డుల‌ను పైఉదాహ‌ర‌ణ‌లో చూద్దాం.

ప‌ట్టిక‌ V:

అస‌లు మొత్తం రూ. 20 ల‌క్ష‌లు, 10,15,20,25 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి 8,8.25,8.50,8.75,9 శాతం వ‌డ్డీ రేట్ల‌తో చెల్లించే ఈఎమ్‌ల వ్య‌త్యాసాన్ని 7, 12 శాతం వ‌డ్డీ రేటుతో పెట్టుబ‌డి పెడితే వ‌చ్చే రాబ‌డిని ప‌రిశీలిద్దాం.

ప‌ట్టిక‌ VI:

అస‌లు మొత్తం రూ. 25 ల‌క్ష‌లు అయితే 10,15,20,25 సంత్స‌రాల కాల‌ప‌రిమితికి 8, 8.25, 8.50, 8.75 శాతం వ‌డ్డీ రేట్ల చొప్పున ఈఎమ్‌లో ఉండే వ్య‌త్యాసాన్ని 7,12 శాతం వ‌డ్డీ చొప్పున పెట్టుబ‌డి పెడితే వ‌చ్చే రాబ‌డి పై ఉదాహ‌ర‌ణ సూచిస్తుంది.

చివ‌రిగా:

చెల్లించ‌వ‌ల‌సిన వ‌డ్డీ రేటులో 0.25 శాతం వ్య‌త్యాసం కార‌ణంగా అద‌న‌పు ఈఎమ్ఐ చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంది. రుణ మొత్తం, కాల‌ప‌రిమితి పెరుగుతున్న కొద్ది దీని ప్ర‌భావం మ‌రింత అధికం అవుతుంది. అందువ‌ల్ల, గృహారుణం తీసుకునే ముందు 3 లేదా 4 గృహ రుణ సంస్థ‌ల వ‌డ్డీ రేట్లు, ప్రాస‌సింగ్ ఫీజు, ముందస్తు చెల్లింపు రుసుములు, ఇత‌ర రుసుములను పొల్చి చూసుకోవాలి. కాంపౌండ్ కార‌ణంగా దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డుల‌పై వీటి ప్ర‌భావం అధికంగా ఉంటుంది. ఇది కొత్త‌గా గృహ రుణం తీసుకునే వారికి ఉప‌యోగంగా ఉంటుంది. ఒక‌వేళ ఇప్ప‌టికే గృహ‌రుణం తీసుకున్న వారు త‌క్కువ వ‌డ్డీ రేటుతో రుణాలు మంజూరు చేసే సంస్థ‌కు మార‌ల‌నుకుంటే ఆసంస్థ విధించే ప్రాస‌సింగ్ రుసుములు, ఇత‌ర రుసుముల గురించి పూర్తిగా తెలుసుకుని అనుకూలంగా ఉంటే మార‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని