మ్యూచువల్ ఫండ్ల‌ త‌న‌ఖాతో రుణాలు

బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను హామీగా పెట్టుకుని రుణాలు ఇచ్చే విధానం అందుబాటులో ఉంది. ఈ త‌ర‌హా రుణాల్లో రుణ‌గ్ర‌హీత‌లు ఆస్తి మద్దతు ఇచ్చినందున, వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. వీటిపై వ‌డ్డీ రేటు సాధారణంగా సంవత్సరానికి 10-12 శాతం

Published : 23 Dec 2020 15:50 IST

బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను హామీగా పెట్టుకుని రుణాలు ఇచ్చే విధానం అందుబాటులో ఉంది. ఈ త‌ర‌హా రుణాల్లో రుణ‌గ్ర‌హీత‌లు ఆస్తి మద్దతు ఇచ్చినందున, వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. వీటిపై వ‌డ్డీ రేటు సాధారణంగా సంవత్సరానికి 10-12 శాతం ఉండొచ్చు. అయితే ఇది మ‌దుప‌ర్లు తీసుకునే బ్యాంకు నిబంధ‌న‌లపై ఆధార‌ప‌డి ఉంటుంది.

బ్యాంకుకు తాకట్టుగా మ్యూచువ‌ల్ ఫండ్లు ఉన్నంత కాలం మ‌దుప‌ర్లు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఉప‌సంహ‌ర‌ణ చేయలేరు. మ‌దుప‌ర్లు రుణాల‌ను తిరిగి చెల్లించిన ప‌క్షంలో బ్యాంకులకు వాటిని ఉప‌సంహ‌రించి నిధులు పొందే అధికారం ఉంటుంది. కనీస రుణం రూ. 25,000 నుంచి గరిష్ట మొత్తం రూ. 5 కోట్ల వ‌ర‌కూ పొందవచ్చు. ప్రాసెసింగ్ రుసుము 0.25% నుంచి రుణ మొత్తంలో 1% వరకు ఉంటుంది.

ఎలా పని చేస్తుంది?
బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు ఆమోదం పొందిన మ్యూచువల్ ఫండ్ల జాబితాను కలిగి ఉంటుంది. వాటిని హామీగా ఉంచుకుని వారు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. దీనికి సంబంధించి మ‌దుప‌ర్లు బ్యాంకుతో మీరు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. స‌ద‌రు బ్యాంకుకు మ్యూచువ‌ల్ ఫండ్ యాజమాన్యాన్ని మంజూరు చేయవలసి ఉంటుంది. త‌ద్వారా రుణ‌గ్ర‌హీత‌లు తీసుకున్నరుణం చెల్లించకపోయిన సంద‌ర్భంలో బ్యాంకులకు ఆ ఫండ్ యూనిట్ల‌ను విక్రయించే హక్కును ల‌భిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్ల నికర ఆస్తుల విలువ 50%, డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై 70-80% వరకూ రుణాల‌ను మంజూరు చేస్తాయి.

చివ‌రి ఎంపిగా
మ్యూచువల్ ఫండ్లు లేదా సెక్యూరిటీలను త‌న‌ఖాగా ఉంచి రుణం పొందే అంశాన్ని మ‌దుప‌ర్లు చివరి ఎంపికగా ఉంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్ల‌పై మార్కెట్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఈ విష‌యంలో డెట్ ఫండ్ల కంటే ఈక్విటీ ఫండ్ల‌లో మ‌రింత‌ ఎక్కువ మార్కెట్ న‌ష్ట‌భ‌యం ఉంటుంది. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు ఈక్విటీ ఫండ్ల‌ను త‌న‌ఖాగా ఉంచి రుణం తీసుకునేముందు మ‌రింత ఆలోచించాలి. ఉదాహ‌ర‌ణ‌కు రూ. 1,00,000 విలువ చేసే మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను త‌న‌ఖాగా ఉంచి రూ. 60,000 రుణం తీసుకున్నారని అనుకుందాం. మార్కెట్ లో ఏర్ప‌డిన ప‌రిణామాల వ‌ల్ల మ్యూచువ‌ల్ ఫండ్ల యూనిట్ల విలువ రూ. 80,000 కు తగ్గినట్లయితే, బ్యాంకు రూ.20,000 ను చెల్లించాల్సిందిగా రుణ‌గ్ర‌హీత‌ల‌ను అడుగుతుంది. లేదా మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్ల‌ను విక్రయించవచ్చని కోరుతుంది. ఈ విధంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను హామీగా ఉంచి రుణం తీసుకోవ‌డంలో కొంత న‌ష్ట‌భ‌యం ఉంటుంది. అయితే వ్య‌క్తిగ‌త రుణం కంటే త‌క్కువ వ‌డ్డీ రేటుకు రుణం పొందే అవ‌కాశం వీటితో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని