బిల్లు చెల్లించేందుకు ఎన్నో మార్గాలు

క్రెడిట్ కార్డు బిల్లుల‌ను క్ర‌మంగా స‌మ‌యానికి చెల్లించ‌డం ఏ వినియోగ‌దారుడికైనా ముఖ్య‌మైన అంశం. రుణం తీర‌డ‌మే కాకుండా క్రెడిట్ స్కోర్ మెరుగు ప‌డేందుకు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. బిల్లు చెల్లించేందుకు ప‌లు మార్గాలు ఉండ‌గా ఇది ఎంత‌మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌ద‌గిన అంశం కాదు. అటువంటి మార్గాలేంటో ఇక్క‌డ చూద్దాం.

Published : 24 Dec 2020 21:23 IST

క్రెడిట్ కార్డు బిల్లుల‌ను క్ర‌మంగా స‌మ‌యానికి చెల్లించ‌డం ఏ వినియోగ‌దారుడికైనా ముఖ్య‌మైన అంశం. రుణం తీర‌డ‌మే కాకుండా క్రెడిట్ స్కోర్ మెరుగు ప‌డేందుకు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. బిల్లు చెల్లించేందుకు ప‌లు మార్గాలు ఉండ‌గా ఇది ఎంత‌మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌ద‌గిన అంశం కాదు. అటువంటి మార్గాలేంటో ఇక్క‌డ చూద్దాం.

నెట్‌ బ్యాంకింగ్‌:
ఇప్పుడు దాదాపు ప్ర‌తి బ్యాంకు నెట్ బ్యాంకింగ్ స‌దుపాయాన్ని అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డును నెట్ బ్యాంకింగ్‌తో అనుసంధానం చేసుకుని బిల్లు చెల్లింపును ఆన్‌లైన్‌లోనే చేయ‌వ‌చ్చు. ఇందుకోసం నెఫ్ట్ లేదా ఐఎమ్‌పీఎస్ స‌దుపాయాల‌ను వాడుకోవ‌చ్చు.

ఏటీఎమ్ న‌గ‌దు బ‌దిలీ:
సేవింగ్స్ లేదా క‌రెంట్ ఖాతా క‌లిగిన వినియోగ‌దారులు బ్యాంకు ఏటీఎమ్ ద్వారా సైతం క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు జ‌ర‌ప‌వ‌చ్చు. ఇందుకోసం ఏటీఎమ్ లో కార్డు పెట్టి అందుకు త‌గిన ఆప్ష‌న్ ఎంచుకుంటే స‌రి.

ఆటో డెబిట్‌:
బ్యాంకు వెబ్‌సైట్ నుంచి ఆటోపే ఫారంను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. దాన్ని పూర్తి చేసి బ్యాంకు శాఖ‌కు స‌మ‌ర్పిస్తే ప్ర‌తి నెలా నిర్ణీత తేదీన క్రెడిట్‌కార్డు బిల్లును మిన‌హాయిస్తారు. మొత్తం బిల్లు లేదా క‌నీస బిల్లు దేనికైనా ఆటో డెబిట్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. దీని వ‌ల్ల క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లింపును మ‌రిచిపోయినా ఖాతాలో నుంచి ఆటోమెటిక్‌గా డబ్బు డెబిట్ అయిపోతుంది. ఆల‌స్య చెల్లింపుల స‌మ‌స్య త‌లెత్త‌దు.

ఫోన్ బ్యాంకింగ్‌:
ఫోన్‌బ్యాంకింగ్ స‌దుపాయం ఉన్న ఖాతాల‌కైతే బ్యాంకు సూచించిన నంబ‌రుకు ఫోన్ చేయ‌డం ద్వారా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపును చేయ‌వ‌చ్చు.

చెక్కు:
చెక్కు జారీ చేసి దానిని ఏటీఎమ్ డ్రాప్‌బాక్స్ లో వేయ‌వ‌చ్చు లేదా బ్యాంకు శాఖ‌ల్లో స‌మ‌ర్పించ‌వ‌చ్చు. చెక్కు ఖాతాలో జ‌మ అయిన త‌ర్వాత బిల్లు చెల్లింపు పూర్త‌వుతుంది.

న‌గ‌దు:
నేరుగా బ్యాంకు శాఖ‌కు వెళ్లి న‌గ‌దును సైతం చెల్లించే వెసులుబాటు సైతం ఉంది. న‌గ‌దు రూపంలో క్రెడిట్ కార్డులు బిల్లులు చెల్లిస్తే కొంత ప్రాసెసింగ్ రుసుమును వ‌సూలుచేస్తారు.

డెబిట్ కార్డు:
డెబిట్ కార్డు సాయంతో సైతం క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించ‌వ‌చ్చు. ఇందుకోసం డెబిట్ కార్డు నంబ‌రు, పిన్ అవ‌స‌రమ‌వుతాయి. బిల్లు చెల్లింపు జ‌ర‌గ్గానే మొబైల్ నంబ‌రుకు సంక్షిప్త సందేశం వ‌స్తుంది.

వీసా మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌:
దేశంలో ఉండే వీసా క్రెడిట్ కార్డుల‌న్నింటికీ ఈ స‌దుపాయం వ‌ర్తిస్తుంది. బ్యాంకు ఖాతా నుంచి నేరుగా ఏదో ఒక ప‌ద్ధ‌తిలో క్రెడిట్‌కార్డుకు డ‌బ్బు బ‌దిలీ చేయ‌డం ద్వారా బిల్లు చెల్లించవ‌చ్చు. ఇందుకు 3 నుంచి 4 ప‌నిదినాల స‌మ‌యం ప‌డుతుంది. ఈ స‌దుపాయం ఉప‌యోగించుకునేందుకు నామ‌మాత్ర‌పు రుసుమును చెల్లించాలి.

మొబైల్ యాప్‌:
ప్ర‌స్తుతం ప్ర‌తి బ్యాంకు ప్ర‌త్యేక మొబైల్ యాప్‌ల‌ను తీసుకువ‌స్తున్నాయి. న‌గ‌దు బదిలీ మొద‌లుకొని విమాన ప్రయాణ టిక్కెట్ల వ‌ర‌కూ చాలా ప‌నుల‌ను ఇందులోనే చేప‌ట్ట‌వ‌చ్చు. అదే విధంగా క్రెడిట్‌కార్డు బిల్లుల‌ను సైతం ఒక్క చేతి క్లిక్‌తో చేసేయ‌వ‌చ్చు.

ఇవ‌న్నీ క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేందుకు గ‌ల వివిధ మార్గాలు. ఇందులో మీకు అనువైన మార్గాన్ని ఎంచుకుని గ‌వువులోపు బిల్లు చెల్లించేందుకు ప్ర‌య‌త్నించండి. ఆల‌స్యంగా చెల్లింపులు చేయ‌డం వ‌ల్ల పెనాల్టీతో పాటు క్రెడిట్ స్కోర్ ప్ర‌భావిత‌మ‌వుతుంద‌న్న విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని