పీటూపీ ద్వారా వేగంగా రుణాలు

పీర్ టూ పీర్ లెండింగ్ అంటే ఒక‌రి నుంచి మ‌రొక‌రు అప్పుగా డ‌బ్బు తీసుకోవ‌డం. దీన్నే సంక్షిప్తంగా పీ2పీ లెండింగ్ అంటారు. రుణం అవ‌స‌ర‌మ‌య్యే (రుణ గ్ర‌హీత‌లు) వారిని, రుణం ఇచ్చి వ‌డ్డీ ఆదాయం ఆర్జించాల‌నుకునే (రుణదాత‌లు) వారిని ఒక వేదిక‌పైకి తీసుకురావ‌డం. పీటూపీలో రుణం ఇచ్చేవారికి

Published : 24 Dec 2020 22:17 IST

పీర్ టూ పీర్ లెండింగ్ అంటే ఒక‌రి నుంచి మ‌రొక‌రు అప్పుగా డ‌బ్బు తీసుకోవ‌డం. దీన్నే సంక్షిప్తంగా పీ2పీ లెండింగ్ అంటారు. రుణం అవ‌స‌ర‌మ‌య్యే (రుణ గ్ర‌హీత‌లు) వారిని, రుణం ఇచ్చి వ‌డ్డీ ఆదాయం ఆర్జించాల‌నుకునే (రుణదాత‌లు) వారిని ఒక వేదిక‌పైకి తీసుకురావ‌డం. పీటూపీలో రుణం ఇచ్చేవారికి వ‌డ్డీ ఆదాయం ల‌భిస్తుంది. రుణం తీసుకునే వారు చెల్లించే వ‌డ్డీ ఆదాయాన్ని రుణాల‌ను అందించే వారు పొందుతారు. దీనికి మ‌ధ్య‌లో పీటూపీ సేవ‌లందించే సంస్థ‌లు ఉంటాయి. చిన్న చిన్న రుణాలు ల‌భించ‌డం క‌ష్టంగా ఉండేవారికి ఈ వేదిక‌ల ద్వారా సుల‌భ‌మైన సేవ‌లు క‌ల్పించ‌డం. దీనికి ఆ సంస్థ‌లు కొంత మొత్తం ఫీజును తీసుకుంటాయి. ఫీజు వివ‌రాలు తీసుకునే రుణం, పీ2పీ సంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కారం మారుతుంటాయి.

పీటూపీ లెండింగ్ ద్వారా ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌కు అవ‌స‌ర‌మైన డ‌బ్బును పొందేందుకు వీలుంది. వైద్య ఖ‌ర్చులు వేగంగా పెరుగుతుండ‌ట‌మే కాకుండా ఎప్పుడు అవ‌స‌ర‌మ‌వుతాయో తెలియ‌ని ప‌రిస్థితి. అందుకే ఆరోగ్య బీమా తీసుకోవాల‌ని ఆర్థిక స‌ల‌హాదారులు చెబుతుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో ఆరోగ్య బీమా వ‌ర్తించ‌నప‌డు లేదా ఆరోగ్య బీమా ప‌రిధిలోకి రాని చికిత్స‌ల‌కు సొంతంగా డ‌బ్బు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. వాటికి పీటీపీ లెండింగ్ ఫ్లాట్ ఫామ్‌ల ద్వారా రుణాల‌ను పొంద‌వ‌చ్చు.

పీ2పీ లెండింగ్ సంస్థ‌ల్లో కొన్ని వైద్య ఖ‌ర్చుల‌కు అవ‌స‌ర‌మైన రుణాల‌ను తొందరంగా మంజూరు చేస్తున్నాయి. లోన్ ట్యాప్, లెన్‌డిన్ క్ల‌బ్, ఫెయిర్ సెంట్, ఐటూఐ ఫండింగ్ లాంటి సంస్థ‌ల ద్వారా వైద్య‌రుణాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో వ‌డ్డీ రేటు 8 శాతం నుంచి అందుబాటులో ఉంటాయి. బ్యాంకుల నుంచి వ్య‌క్తిగ‌త రుణాల‌ను పొందాలంటే దీని కంటే ఎక్కువ‌నే అవుతుంది. రుణ‌గ్ర‌హీత‌లు పీటీపీ లెండింగ్ లో రుణాలు తీసుకునే ముందు వ‌డ్డీ రేటు గ‌మ‌నించి తీసుకోవాలి. వీటిలో కొన్ని సంస్థ‌లు అధిక వ‌డ్డీ రేట్ల‌ను విధించే అవ‌కాశం ఉంటుంది. పీటూపీ ద్వారా రుణాలు తీసుకునే వారు వ‌డ్డీరేటు, ఇత‌ర నిబంధ‌న‌లు తెలుసుకోవాలి.

ప్ర‌స్తుతానికి ఈ త‌ర‌హా లెండింగ్ ఫ్లాట్ ఫామ్ లు ప్రారంభ‌ద‌శ‌లో ఉండ‌టంతో రుణాలందించే వారికి సంస్థ‌లు పూచిక‌త్తుగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. వారికిచ్చే వ‌డ్డీ ఆదాయం, అస‌లుకు గ్యారంటీగా ఉంటున్నాయి. ఈ సంస్థ‌లు వివిధ ర‌కాల రుణాల‌ను అందింస్తుంటాయి. ముఖ్యంగా వైద్య ఖ‌ర్చుల‌కు అవ‌స‌ర‌మయ్యే రుణాల‌ ప్ర‌క్రియ‌ను తొంద‌ర‌గా పూర్తిచేస్తున్న‌ట్లు పీటూపీ లెండింగ్ సంస్థల‌ నిర్వాహ‌కులు చెబుతున్నారు.

బ్యాంకులతో పోలిస్తే వీటిలో రుణం పొందేందుకు స‌మ‌యం త‌క్కువ‌గా ఉంటుంది. ఎందుకంటే వీటిలో క్రెడిట్ స్కోరు త‌దిత‌ర వివ‌రాలు అవ‌స‌రం ఉండ‌దు. డాక్యుమెంట్ల వెరిఫికేష‌న్ వంటి కార్య‌క్ర‌మాలు తొంద‌ర‌గా పూర్త‌వుతాయి. కొన్ని సంస్థ‌లు అత్య‌వ‌స‌ర రుణాల‌ తీసుకునే వారికి డ‌బ్బు త‌మ బ్యాంకు ఖాతాలో అదే రోజు రుణం జ‌మ‌య్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త‌క్కువ కాల‌ప‌రిమితికి రుణం పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. వీటి ద్వారా 3 , 6 నెల‌లు త‌క్కువ కాల‌ప‌రిమితికి కూడా రుణాలు ల‌భ్య‌మ‌వుతాయి.

కొన్ని పీ2పీ లెండింగ్ వెబ్‌సైట్లు:

* ఫెయిర్ సెంట్
* ఐ-లెండ్
* లెండ్ బాక్స్
* లెండెన్ క్ల‌బ్
* క్యాష్ కుమార్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని