Published : 24 Dec 2020 22:31 IST

పీపీఎఫ్ ద్వారా ఇలా హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించవచ్చు!

ఇల్లు కొనుగోలు చేయడం అనేది దీర్ఘకాలిక పెట్టుబడి . చాలామంది తమ జీవిత కాలంలో ఇంటిని ఒక‌సారే కొనుగోలు చేయగలరు. దీంతో పాటు ఇతర ఆర్థిక లక్ష్యాలు కూడా ఉంటాయి. అవి పిల్లల ఉన్నత చదువు , వివాహం , పదవి విరమణ నిధి వంటివి . ఒక లక్ష్యం కోసం 2-3 పథకాల్లో పెట్టుబడులు చేయాలి. పెట్టుబడులు ప్రారంభించే ముందు భద్రత, రాబడి, లిక్విడిటీ, నష్ట భయం, కాలపరిమితి, పన్ను వంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.

పెట్టుబడులు చిన్న వయసులోనే ప్రారంభిస్తే దీర్ఘకాలానికి ఎక్కువ సంపదను సృష్టించుకోవచ్చు . ఉదాహరణకు రఘు అనే వ్యక్తి 25 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరాడు. 40 ఏళ్ల వయసులో ఇంటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నాడు. అంటే దానికోసం అతనికి 15 సంవత్సరాల స‌మ‌యం ఉంది. దీంతో పీపీఎఫ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల ద్వారా డౌన్ పేమెంట్ , ఈఎంఐ కోసం సులభంగా డబ్బును పొదుపు చేసుకోవచ్చు .

అతను కొనుగోలు చేయాలనుకున్న ఇంటి విలువ ప్రస్తుతం రూ.40 లక్షలు. 15 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనాలనుకున్నాడు. 7 శాతం ద్రవ్యోల్భణం అంచ‌నాతో 15 ఏళ్ల తర్వాత ఇంటి విలువ రూ.1.10 కోట్లకు పెరుగుతుంది. డౌన్ పేమెంట్ ఇంటి విలువలో 10 శాతం, అంటే రూ.10 లక్షలు . మిగ‌తా కోటి రూపాయిలు 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో గృహ రుణం తీసుకోవ‌చ్చు. వ‌డ్డీ రేటు వార్షికంగా 9 శాతంగా అంచ‌నా వేస్తే, ఈఎమ్ఐ రూ.1,01,500. (ప్ర‌స్తుత ఈఎమ్ఐ రూ.36,800)

పీపీఎఫ్ పెట్టుబ‌డులు:

ప్ర‌భుత్వం సెక్ష‌న్ 80 సీ కింద ఇచ్చే పీపీఎఫ్ ప‌న్ను మిన‌హాయింపు 5 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి పెంచింద‌నుకోండి. మొద‌టి ఐదేళ్ల‌లో పెట్టుబ‌డులు ఏడాదికి రూ.1.50 ల‌క్ష‌లు ( నెల‌కు రూ.12,500), ఆ త‌ర్వాత ఐదేళ్ల‌కు రూ.2 ల‌క్ష‌లు సంవ‌త్స‌రానికి, ( నెల‌కు రూ.16,500) మ‌రో ఐదేళ్ల‌కు, ఏడాదికి రూ.2.40 ల‌క్ష‌లు (నెల‌కు రూ.20,000) మెచ్యూరిటీ త‌ర్వాత‌, మ‌రో ఐదేళ్లు గ‌డువు పొడ‌గించుకుంటే ఏడాదికి రూ.3 ల‌క్ష‌లు (రూ.25 వేలు). పీపీఎఫ్ డిపాజిట్లు, జ‌మ‌య్యే వ‌డ్డీ, ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఈ కింది టేబుల్‌లో డిపాజిట్లు, వ‌డ్డీరేట్లు, ఉప‌సంహ‌ర‌ణ‌ల వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబ‌డులు సుర‌క్షితం, క‌చ్చితం, అదేవిధంగా ప‌న్ను మిన‌హాయింపు కూడా ల‌భిస్తుంది. ఏడ‌వ సంవ‌త్స‌రం నుంచి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌లకు అవ‌కాశం ఉంటుంది. ఈఎమ్ఐ త‌గ్గించుకునేందుకు ఈక్విటీల‌లో అద‌న‌పు పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది.

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు:

ఈక్విటీలు స్వ‌ల్ప‌కాలంలో ఒడుదొడుకుల‌కు లోనుకావొచ్చు. కానీ ప‌దేళ్లు అంత‌కంటే ఎక్కువ కాలానికి మంచి రాబ‌డిని అందిస్తాయి. 15 సంవ‌త్స‌రాల నుంచి ఈఎమ్ఐ త‌గ్గించుకునేందుకు… సిప్ ద్వారా నెల‌కు రూ.9,600 తో పెట్టుబ‌డులు ప్రారంభించాలి. సంవ‌త్స‌రానికి రూ.1,15,200 , 15 సంవ‌త్స‌రాలు కొన‌సాగించాలి. 12 శాతం రాబ‌డి అంచ‌నాతో ప్ర‌తి సంవ‌త్స‌రం రూ.6 ల‌క్ష‌లు ల‌భిస్తుంది. 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఉప‌సంహ‌రించుకొని ఈఎమ్ఐ 15 సంవ‌త్స‌రాల‌కు చెల్లించేందుకు ఉప‌యోగించుకోవాలి.

పీపీఎఫ్ లో పెట్టుబ‌డులకు రాబ‌డి త‌క్కువ‌గా ఉంటుంది. మ‌రి దీనికి బదులుగా ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ఉత్త‌మం క‌దా అని భావించ‌వ‌చ్చు. పీపీఎఫ్‌లో ఉన్న ప్ర‌యోజ‌నాలు ఏంటంటే పూర్తి ప‌న్ను మిన‌హాయింపులు ల‌భించ‌డంతో పాటు, క‌చ్చిత‌మైన రాబ‌డి పొంద‌వ‌చ్చు. అయితే 50 శాతం పీపీఎఫ్ నుంచి, 50 శాతం ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి పొంద‌డం ద్వారా ఎమ్ఐల‌ను చెల్లించ‌వ‌చ్చు.
మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డుల‌ను పెంచాలి. అప్పుడు నిక‌ర ఆస్తి విలువ త‌గ్గుతుంది కాబ‌ట్టి ఎక్కువ యూనిట్ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకుంటే వ్య‌య నిష్ప‌త్తి త‌క్కువ‌గా ఉంటుంది.

ప్ర‌తీ ఏడాది ఆదాయం పెరిగినాకొద్ది నెల‌వారి పెట్టుబ‌డుల‌ను పెంచుకుంటూ పోవాలి. ఈఎమ్ఐ మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ఒకేవిధంగా ఉంటుంది. వ‌డ్డీ రేట్ల‌లో వ‌చ్చే మార్పుల వ‌ల‌న కాల‌ప‌రిమితి పెర‌గ‌డం లేదా త‌గ్గ‌డం జ‌రుగుతుంది. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో రాబ‌డి దీర్ఘ‌కాలంలో ఎక్కువ‌గా ఉంటుంది. గృహ రుణ వ‌డ్డీని మించి లాభాన్ని పొంద‌వ‌చ్చు.

చివ‌ర‌గా:
గృహ రుణ వ‌డ్డీ చెల్లింపుల‌పై సెక్ష‌న్ 24బి కింద ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి. కాబట్టి, ముందస్తు రుణ చెల్లింపులు అనేవి సూచించ‌ద‌గిన‌ది కాదు. ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరేందుకు చాలా ర‌కాల పెట్టుబ‌డులు ఉన్నాయి. లక్ష్యాలను సాధించడానికి స్థిరత్వం, సంకల్పం ఉండాలి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని