రెపో ఆధారిత రుణ రేట్ల గురించి తెలుసుకున్నారా?

మీ కళల ఇంటిని కొనుగోలు చేసేందుకు, బ్యాంకుల ద్వారా తగిన గృహరుణం పొందడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి . అయితే ఎంచుకునే ముందు తగిన పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక దీర్ఘకాలిక , అధిక మొత్తంలో చేసే పెట్టుబడి. అదీగాక ఆర్‌బీఐ

Published : 24 Dec 2020 22:32 IST

మీ కళల ఇంటిని కొనుగోలు చేసేందుకు, బ్యాంకుల ద్వారా తగిన గృహరుణం పొందడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి . అయితే ఎంచుకునే ముందు తగిన పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక దీర్ఘకాలిక , అధిక మొత్తంలో చేసే పెట్టుబడి. అదీగాక ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం అన్ని రకాల రిటైల్ రుణాలను ఎక్సటర్నల్ బెంచ్ మార్క్ కు అనుసంధానించాల్సి ఉంటుంది.
బెంచ్ మార్క్ : ఈ కింది వాటిని ఎక్సటర్నల్ బెంచ్ మార్క్ గా ఆర్‌బీఐ సూచించింది :

* మూడు లేదా ఆరు నెలల ట్రెజరీ బిల్స్,
* రేపో రేట్ లేదా ఫైనాన్సియల్ బెంచ్ మార్క్స్ ఇండియా ప్రై లిమిటెడ్ వారు ప్రకటించిన మరేదైనా బెంచ్ మార్క్ రేట్ ను బ్యాంకులు రుణాలకు లింక్ చేసుకోవచ్చు. చాలా బ్యాంకులు రేపో రేట్ ను బెంచ్ మార్క్ గా తీసుకుంటే, సిటీ బ్యాంకు 3 నెలల ట్రెజరీ బిల్స్ ను తీసుకుంది.
ట్రెజరీ బిల్స్ త్వరిత గతిన హెచ్చుతగ్గులకు గురి అవుతాయి కాబట్టి , వీటితో లింక్ చేయబడిన రుణాలఫై ప్రభావం ఉంటుంది. అధిక ఆదాయం ఉన్నవారికి ఫరవాలేదు, కానీ మధ్య, దిగువ తరగతి ఆదాయా వర్గాల వారికి అనువైనది కాదని ఆన్లైన్ లోన్ అగ్రిగేటర్ ‘మై లోన్ కేర్’ ఫౌండర్ అండ్ సిఇఓ గౌరవ్ గుప్తా తెలిపారు. ఎక్స్‌ట‌ర్న‌ల్‌ బెంచ్ మార్క్ వలన త్వరితగతిన తక్కువ వడ్డీ రేట్లను అందించడం, మరింత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.

డిపాజిట్లపై వడ్డీ తగ్గింపును వెంటనే అమలు చేసే బ్యాంకులు , గృహరుణాలపై వడ్డీని త‌గ్గించేందుకు ఆసక్తి చూపవు. కొత్త రుణగ్రహీతలు ఆకట్టుకునేందుకు వడ్డీ రేట్లు తగ్గిస్తాయి కానీ, పాత రుణగ్రహీతలు ఈ తగ్గింపును తొందరగా అమలు చేయవు. రుణాలపై వడ్డీ రేట్ల పెంచినా త్వరగా, డిపాజిట్లపై పెంచవు. అయితే , కొత్త విధానం వలన బెంచ్ మార్క్ రేట్ లో మార్పు వలన కొత్త వినియోగదారులతోపాటు, పాత వారు కూడా లబ్దిపొందుతారని ‘మై మనీ మంత్ర’ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ ఖోస్లా తెలిపారు.

వడ్డీ రేట్లలో మార్పులను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆపాదించవలసి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఎంసిఎల్ఆర్ (MCLR -marginal cost of lending rate) ప్రకారం ఏడాదికి ఒకసారి వడ్డీ రేట్లను మార్చేవారు.
చాలా బ్యాంకులు మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు సవరణకు ప్రతిపాదించితే, కొన్ని బ్యాంకులు ప్రతి నెలా సవరించేందుకు ప్రతిపాదించాయి. అయితే రేపో రేట్ అనేది సాధారణంగా మూడు నెలలకు ఒకసారి స‌వ‌రణ‌ జ‌రుగుతుందికాబట్టి, మూడు నెలలకు ఒకసారి సరైనది.

కొన్ని బ్యాంకులు ఉదా : సిటీ బ్యాంకు మూడు నెలల ట్రెజరీ బిల్ ఆధారిత రేపో రేట్ ను తీసుకున్నది కాబట్టి, ప్రతి నెల ప్రకటించినప్పటికీ , ప్రతి మూడు నెలలకు ఒకసారి మొదటి తేదీన మాత్రమే సవరించనుంది. అందువలన సవరించే తేదీలను మార్చ్ 1, జూన్ 1, సెప్టెంబర్ 1, డిసెంబర్ 1 గా నిర్ణయించాయి. అక్టోబర్ , నవంబర్ నెలలలో బెంచ్ మార్క్ రేట్ లో జరిగిన తగ్గింపులను డిసెంబర్ 1 నుంచి అమలు చేస్తుంది.

అందువలన వడ్డీరేటు సవరింపు తేదీని తెలుసుకోవడంద్వారా మీరు మరింత సమర్ధవంతంగా మీ ఆర్ధిక ప్ర‌ణాళిక‌ను నిర్వహించుకోగలరు. అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్ని విషయాలు అవగతం అయిన తరువాతే ముందుకు వెళ్లాలని ‘బ్యాంక్ బజార్’ అధికారి నవీన్ చందాని అన్నారు.
'స్ప్రెడ్ ’ అనేది బెంచ్ మార్క్ రేట్ మీద బ్యాంక్ ఛార్జ్ చేసే రేటు. అంటే రుణగ్రహీత చెల్లించే వడ్డీరేటు రేపో రేటు ప్లస్ స్ప్రెడ్ అన్న మాట. రుణగ్రహీతను బట్టి బ్యాంకులు రుణం ఇచ్చే సమయంలో వడ్డీ రేట్లను నిర్ణయించుకోవచ్చు. రుణం తీసుకునేటప్పుడు లేదా తీసుకున్న తరువాత , ఒకే బెంచ్ మార్క్ ఉపయోగిస్తున్న వివిధ బ్యాంకులతో పోల్చిచూసుకోవచ్చు. దీనిద్వారా మీరు అధికంగా ఏమైనా చెల్లిస్తున్నారో తెలుసుకోవ‌చ్చు.

తక్కువ స్ప్రెడ్ ఉంటే , తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించినట్లు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. బెంచ్ మార్క్ రేట్ పైన విధించే స్ప్రెడ్ లో బ్యాంకు ఖర్చులతో పాటు, రుణగ్రహీత క్రెడిట్ రిస్క్ ప్రీమియం కూడా ఉంటుంది. బ్యాంకులు ఈ స్ప్రెడ్ ను వారి ఆపరేటింగ్ ఖర్చులకు అనుగుణంగా మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సవరించుకోవచ్చు. ఒకవేళ రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ లో తేడా ఉన్నట్లయితే ఎప్పుడైనా పెంచుకోవచ్చు.
కొన్ని బ్యాంకులు ఈ రిస్క్ ప్రీమియం ను రుణగ్రహీత సిబిల్ స్కోర్ తో ముడిపెట్టాయి . కొన్ని బ్యాంకులు అంతర్గత పరామితులను నిర్ణయించి , వాటికి అనుగుణంగా రిస్క్ ప్రీమియం ను పరిగణిస్తాయి. ఉదా: బ్యాంక్ అఫ్ ఇండియా ప్రకారం రుణగ్రహీత సిబిల్ స్కోర్ 760 లేదా అంతకంటే ఎక్కువ ఉంటె 10 బేసిస్ పాయింట్స్ ఛార్జ్ చేస్తాయి. ఒకవేళ క్రెడిట్ స్కోర్ 725-759 మధ్య ఉంటె 30 bps , అలాగే 625-724 మధ్య ఉంటె 40bps ఛార్జ్ చేస్తాయి.

క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఈ ఎం ఐ చెల్లించకపోయినా, క్రెడిట్ స్కోర్ తగ్గినా , రుణదాత స్ప్రెడ్ ను పెంచవచ్చని స్విత్ మీ సిఈఓ ఆదిత్య మిశ్రా తెలిపారు. ఈ స్ప్రెడ్ లో ఫిక్స్‌డ్ స్ర్పెడ్ తోపాటు రుణగ్రహీత క్రెడిట్ రిస్క్ ప్రీమియం కూడా ఉంటుంది కాబట్టి, రుణగ్రహీతలు జాగ్రత్తగా పరిశీలించాలి. వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు ఫర్వాలేదు కానీ , పెరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీనివలన అధిక వడ్డీ చెల్లించవలసి రావచ్చు. ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్‌మార్క్‌తో పాటు బ్యాంక్ సేవ‌ల్లో నాణ్య‌త‌, ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇంత‌ర అంశాలు కూడా ముఖ్య‌మే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు