సక్రమంగా కారు బీమా క్లెయిమ్ ను పొందడం ఎలా?

ఒకవేళ మీకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, బీమా సంస్థ మీ దావాను తిరస్కరించే హక్కును కలిగి ఉంటుంది

Published : 20 Dec 2020 20:40 IST

కారు బీమా పాలసీ థర్డ్ పార్టీ బాధ్యతను కలిగి ఉంటుంది. ఒకవేళ మీ కారు వలన ఎవరైనా ప్రమాదానికి గురైనా లేదా కారు దొంగతనానికి గురైన లేదా కారుకు ఏదైనా నష్టం వాటిల్లినా థర్డ్ పార్టీ ద్వారా కవరేజ్ లభిస్తుంది. కానీ కేవలం బీమా పాలసీ ఉన్నంత మాత్రాన మీరు క్లెయిమ్ చేసుకోవడం కుదరదు. దాని కోసం మీరు బాధ్యతాయుతమైన యజమాని, డ్రైవర్ అని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. సరైన బీమా ఉన్నప్పటికీ, బీమా సంస్థ మీరు దాఖలు చేసిన క్లెయిమ్ ను తిరస్కరించడానికి గల నాలుగు ముఖ్యమైన కారణాలను కింద తెలియచేస్తున్నాము.

చెల్లని డ్రైవింగ్ లైసెన్స్:

ఒక కారును లేదా కారు బీమాను కొనుగోలు చేసే సమయంలో, మీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ను చూపించాల్సిన అవసరం లేదు, కానీ కారును నడిపే సమయంలో మాత్రం ఇది ఖచ్చితంగా అవసరం. ఒకవేళ మీకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, బీమా సంస్థ మీ దావాను తిరస్కరించే హక్కును కలిగి ఉంటుంది. మీరు క్లెయిమ్ కోసం దావా వేసే సమయంలో, బీమా సంస్థ మీ అసలు డ్రైవింగ్ లైసెన్స్ ను చూపించవలసిందిగా కోరుతుంది. కాబట్టి మీరు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును నడపడం చట్టరీత్యా కూడా నేరం.

మద్యం తాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం:

మద్యం తాగి వాహనాన్ని నడపడమనేది మీ నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అందుచేత బీమా సంస్థ ఇలాంటి క్లైములను అనుమతించదు.

అలాగే బీమా సంస్థలు వారు అందించే కారు బీమా కరపత్రంలో కూడా మద్యం తాగి వాహనం నడిపే వ్యక్తి కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే కవరేజ్ లభించదని స్పష్టంగా పేర్కొంటాయి.

వాహనాన్ని సరైన అవసరం కోసం వినియోగించకపోవడం:

ఒకవేళ మీరు వ్యక్తిగత వినియోగం కోసం వాహనాన్ని కొనుగోలు చేసి, అనంతరం దానిని వాణిజ్య పరంగా వినియోగించకూడదని నిర్ధారించుకోండి. దావా వేసే సమయంలో, నష్టపరిహారాలకు సంబంధించిన పూర్తి కారణాలను తనిఖీ చేసేందుకు బీమా సంస్థ ఒక సర్వేయర్ ను నియమిస్తారు. ఒకవేళ వ్యక్తిగత వినియోగం కోసం కొన్న కారును టాక్సీగా ఉపయోగించారని సర్వే కనుగొన్నట్లైతే, మీ క్లెయిమ్ను బీమా సంస్థ నిరాకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వేరొకరి పేరుతో బీమా:

ఒకవేళ మీరు ఒక సెకండ్ హ్యాండ్ కారుని కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో యజమాని పేరును మార్చాలి, అలాగే బీమా పాలసీలో కూడా యాజమాని పేరును మార్చాల్సి ఉంటుంది. దీన్ని సులభం చేయడానికి మీరు బీమా సంస్థను సంప్రదించి కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను వారికి చూపించి పాలసీ ని మీ పేరు మీదకు బదిలీ చేయించుకోండి.

కేవలం కారు బీమా పాలసీని కొనుగోలు చేస్తే సరిపోదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సక్రమంగా క్లెయిమ్ పొందేలా డ్రైవర్ వ్యవహరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని