స్వల్పకాలిక మదుపరుల కోసం

రుణపత్రాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే మదుపరుల కోసం ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, ‘ఐడీఎఫ్‌సీ ఫ్లోటింగ్‌ రేట్‌ ఫండ్‌’ అనే పేరుతో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 16 వరకూ అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.5,000. దీని పనితీరును నిఫ్టీ లోడ్యూరేషన్‌ డెట్‌ ఇండెక్స్‌తో పోల్చి చూస్తారు

Published : 12 Feb 2021 01:48 IST

ఐడీఎఫ్‌సీ ఫ్లోటింగ్‌ రేట్‌ ఫండ్‌

రుణపత్రాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే మదుపరుల కోసం ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, ‘ఐడీఎఫ్‌సీ ఫ్లోటింగ్‌ రేట్‌ ఫండ్‌’ అనే పేరుతో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 16 వరకూ అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.5,000. దీని పనితీరును నిఫ్టీ లోడ్యూరేషన్‌ డెట్‌ ఇండెక్స్‌తో పోల్చి చూస్తారు. మనీ మార్కెట్‌ పత్రాలు, స్థిరమైన వడ్డీరేటును ఇచ్చే రుణ పత్రాల్లో పెట్టుబడులు పెడుతుంది. సమీకరించిన సొమ్ములో కనీసం 65 శాతాన్ని కార్పొరేట్‌ సంస్థలు లేదా ప్రభుత్వం జారీ చేసే సెక్యూరిటీలకు కేటాయిస్తుంది. ప్రధానంగా ‘ట్రిపుల్‌ ఏ’ రేటింగ్‌ ఉన్న పత్రాలను ఎంచుకుంటుంది. ప్రస్తుతానికి స్వల్పకాలిక పోర్ట్‌ఫోలియోను నిర్మించాలని ఈ ఫండ్‌ భావిస్తోంది. అందువల్ల కనీసం ఆరు నెలల కాలానికి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అనురాగ్‌ మిత్తల్‌, అరవింద్‌ సుబ్రమణియన్‌ ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.
మహీంద్రా మనులైఫ్‌ నుంచి..
స్వల్పకాలిక రుణ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని మహీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ‘మహీంద్రా మనులైఫ్‌ షార్ట్‌ టెర్మ్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 16. ‘మెకాలే డ్యూరేషన్‌’ సూత్రం ఆధారంగా ఒక ఏడాది నుంచి మూడేళ్లు ఉండే రుణ పత్రాల్లో పెట్టుబడి పెడుతుంది. మనీ మార్కెట్‌ పత్రాలతో పాటు రీట్‌లు, ఇన్విట్‌లకు 10 శాతం సొమ్ము కేటాయించే అవకాశం ఈ ఫండ్‌కు ఉంది.  తమ పెట్టుబడికి భద్రత ఉండాలని కోరుకుంటూ, 1- 3 సంవత్సరాల పాటు ఎదురుచూడగలిగే మదుపరులకు ఈ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం అనుకూలం. అంతేగాక అధిక రిస్కుతో కూడిన పెట్టుబడులు తగ్గించుకొని కొంత మొత్తాన్ని తక్కువ రిస్కు కల రుణ పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారూ దీన్ని చూడొచ్చు. ఈ ఫండ్‌కు రాహుల్‌ పాల్‌, కుష్‌ సోనిగర  మేనేజర్లుగా వ్యవహరిస్తారు. స్టాక్‌మార్కెట్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రిటైల్‌ మదుపరులు ఇటువంటి పథకాలను  పరిశీలించవచ్చనేది నిపుణుల సలహా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని