Updated : 24 Sep 2021 09:10 IST

Mutual Funds: అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లలో...

‘హెచ్‌డీఎఫ్‌సీ డెవలప్డ్‌ వరల్డ్‌ ఇండెక్సెస్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’

‘హెచ్‌డీఎఫ్‌సీ డెవలప్డ్‌ వరల్డ్‌ ఇండెక్సెస్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’ అనే పేరుతో ఒక వినూత్నమైన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ అక్టోబరు 1. దీనికి క్రిషన్‌ కుమార్‌ డాగా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ఎన్‌ఎఫ్‌ఓ కనీస పెట్టుబడి రూ.5,000. కేవలం ‘గ్రోత్‌’ ఆప్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ‘డివిడెండ్‌’ ఆప్షన్‌ లేదు. ఎక్స్‌పెన్సెన్‌ రేషియో రెగ్యులర్‌ ప్లాన్‌లో  1 శాతం కాగా, డైరెక్ట్‌ ప్లాన్‌లో 0.5 శాతం మాత్రమే. ఈ పథకం పనితీరుకు ఎంఎస్‌సీఐ వరల్డ్‌ ఇండెక్స్‌ - నెట్‌ టీఆర్‌ఐని కొలమానంగా తీసుకుంటారు. ఎంఎస్‌సీఐ వరల్డ్‌ ఇండెక్స్‌లో యూఎస్‌, జపాన్‌, యూకే, ఫ్రాన్స్‌, కెనడా తదితర దేశాలు ఉన్నాయి. కానీ 50 శాతానికి పైగా వాటా అమెరికాదే కావటం గమనార్హం.

భారతీయ మదుపరులు అభివృద్ధి చెందిన దేశాల స్టాక్‌ ఎక్స్ఛేంజీల సూచీల్లో పెట్టుబడి పెట్టటానికి, తద్వారా లాభాలు ఆశించటానికి ఈ పథకం వీలు కల్పిస్తుంది. దాదాపు 14 దేశాల్లోని స్టాక్‌ ఎక్స్ఛేంజీల సూచీల్లో భాగంగా ఉన్న 1,500 కంపెనీల్లో పరోక్షంగా ఈ ఫండ్‌ పెట్టుబడి పెడుతుంది. తద్వారా ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల మార్కెట్‌ కేపిటలైజేషన్‌లో 50 శాతం ‘ఎక్స్‌పోజర్‌’ తీసుకున్నట్లు అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లోని స్టాక్‌ మార్కెట్లలో తమ పెట్టుబడులు ఉండాలనుకునే మదుపరులకు ఇది అనువైన పథకం. క్రెడిట్‌ సూయిస్సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌తో కలిసి దీన్ని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. క్రెడిట్‌ సూయిస్సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణలో 10 బిలియన్‌ డాలర్ల నిధులు ఉన్నాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని