దీర్ఘకాలిక పెట్టుబడికి

స్టాక్‌ మార్కెట్లో మిడ్‌ క్యాప్‌ తరగతికి చెందిన షేర్లలో ఇండెక్స్‌ ఫండ్‌ ద్వారా మదుపు చేయాలనుకునే వారికి అనువైనదిగా ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్‌’ పేరుతో

Updated : 11 Dec 2021 08:48 IST

స్టాక్‌ మార్కెట్లో మిడ్‌ క్యాప్‌ తరగతికి చెందిన షేర్లలో ఇండెక్స్‌ ఫండ్‌ ద్వారా మదుపు చేయాలనుకునే వారికి అనువైనదిగా ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్‌’ పేరుతో ఒక కొత్త పథకాన్ని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ తీసుకువచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 17. కనీస పెట్టుబడి రూ.100. లార్జ్‌ క్యాప్‌ ఫండ్లతో పోల్చితే మిడ్‌ క్యాప్‌ ఫండ్ల ఎన్‌ఏఈ (నెట్‌ అసెట్‌ వాల్యూ) బాగా హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో మిడ్‌ క్యాప్‌ విభాగంలోనే అధిక ప్రతిఫలం కనిపిస్తుంది. గత పదేళ్ల కాలంలో నిఫ్టీ 50 టీఆర్‌ఐ, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 250 టీఆర్‌ఐతో పోలిస్తే నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ మెరుగైన పనితీరు ప్రదర్శించటం గమనార్హం. ఈ దిశగా చూస్తే ఇది ఆసక్తికరమైన పథకమనే చెప్పాలి. దీర్ఘకాలంలో ఇటువంటి పథకాలు మంచి పనితీరు ప్రదర్శించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని