ఈక్విటీ డివిడెండ్ల‌పై టీడీఎస్ ఎలా వ‌ర్తిస్తుంది

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతాయి. అందువల్ల ప‌రోక్షంగా స్టాక్‌లను కలిగి ఉంటారు

Published : 16 Dec 2020 16:53 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి, నివాస భారతీయులకు రూ. 5,000 కంటే ఎక్కువ ఈక్విటీ డివిడెండ్లపై టీడీఎస్‌ 7.5 శాతం వర్తిస్తుంది. కంపెనీలు ఈ నిబంధనను తెలియజేస్తూ వాటాదారులకు ఇ-మెయిల్ పంపడం ప్రారంభించాయి, టీడీఎస్‌ మినహాయింపు కావాల‌నుకుంటే తగిన పత్రాలను అందించమని కోరాయి.

అంత‌కుముందే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (డీడీటీ) ను షేర్ల నుంచి డివిడెండ్లపై 15 శాతం వద్ద విధించిన సంగ‌తి తెలిసిందే. సర్‌చార్జ్, సెస్ తరువాత, ఈ రేటు మరింత పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది 20.35 శాతానికి వచ్చింది. అయితే, బడ్జెట్ 2019 డీడీటీని రద్దు చేసి, డివిడెండ్లపై వాటాదారుల చేతిలో పన్ను విధించేలా చేసింది. ఇది రూ. 5,000 పైన డివిడెండ్లపై 7.5 శాతం వద్ద టీడీఎస్ విధించింది. ఇంతకుముందు డీడీటీకి లోబడి ఉన్న మ్యూచువల్ ఫండ్లపై డివిడెండ్లకు కూడా ఈ మార్పు వర్తిస్తుంది.

మీ ఆదాయం సంవత్సరానికి రూ. 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే, టీడీఎస్ మిన‌హాయింపు కోసం ఫారం 15 జి లేదా ఫారం 15 హెచ్ (మీకు 60 ఏళ్లు పైబడి ఉంటే) కంపెనీకి సమర్పించవచ్చు. మీరు నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) అయితే, డివిడెండ్లపై టీడీఎస్ 20 శాతం వ‌ర్తిస్తుంది. ఏదేమైనా, కొన్ని దేశాలతో డబుల్ టాక్సేషన్ ఎగవేత ఒప్పందాలు (డీటీఏఏ) కార‌ణంగా తక్కువ టిడిఎస్ కోసం అందిస్తాయి. ఈ ప్రయోజనాన్ని పొందటానికి, మీరు మీ స్వదేశం నుంచి టాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (టీఆర్‌పీ) ను పొందాలి, దానిని భారతదేశంలో సమర్పించాలి.

మీ డివిడెండ్ మొత్తం రూ. 5,000 కన్నా తక్కువ ఉంటే, టీడీఎస్ ఉండ‌దు. అయితే, మీ ఆదాయాన్ని మొత్తం ఆదాయానికి జోడించి, వర్తించే పన్నును చెల్లించాలి. డివిడెండ్ ఆదాయానికి శ్లాబు రేటుపై పన్ను వర్తిస్తుంది ఉదాహరణకు, ఒక సంవత్సరంలో మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.10 లక్షలు దాటితే, మీకు రూ.3,000 డివిడెండ్ లభిస్తే, మీరు వర్తించే సర్‌చార్జ్, సెస్‌తో పాటు 30 శాతం (రూ. 900) వద్ద పన్ను చెల్లించాలి.
మ్యూచువ‌ల్ ఫండ్ల‌తో లాభం

డివిడెండ్‌పై ప‌న్ను ప‌డ‌కుండా ఉండాలండే ప్ర‌త్య‌క్షంగా స్టాక్స్ క‌లిగి ఉండ‌కుండా , మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు మారాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతాయి. అందువల్ల ప‌రోక్షంగా స్టాక్‌లను కలిగి ఉంటారు. మ్యూచువల్ ఫండ్ల‌ డివిడెండ్లపై పన్ను మిన‌హాయింపు ఉంటుంది. డివిడెండ్, నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) కు జోడిస్తారు, ఇది చివ‌రికి పెట్టుబడిదారునికి ప్రయోజనం చేకూరుస్తుంది.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ పెట్టుబడిదారులు యూనిట్లను రీడీమ్ చేసినప్పుడు మాత్రమే మూలధన లాభ పన్ను చెల్లించాలి. ఇది ఒక సంవత్సరం కన్నా తక్కువ వ్యవధి అయితే 15 శాతం, అంత‌కంటే ఎక్కువ‌ కాలం ఉంటే 10 శాతం వ‌ర్తిస్తుంది. సంవత్సరానికి రూ. 1 లక్షల వరకు లాభాలపై మినహాయింపు ల‌భిస్తుంది. పెట్టుబడిదారులు స్టాక్ పోర్ట్‌ఫోలియోల విష‌యంలో అప్రమత్తంగా ఉండాలి. మ్యూచువల్ ఫండ్ మీ పెట్టుబ‌డుల‌ను స‌రిగ్గా నిర్వ‌హించ‌గ‌ల‌దు. మ్యూచువల్ ఫండ్ల కోసం అధిక వ్యయ నిష్పత్తులను చెల్లించడం మీకు ఇష్టం లేకపోతే, డైరెక్ట్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు.

ఏదేమైనా, మ్యూచువల్ ఫండ్ల నుంచి వచ్చే డివిడెండ్ల‌పై కూడా శ్లాబు రేటు ఆధారంగా ప‌న్ను వ‌ర్తిస్తుంది.అందువల్ల గ్రోత్ ఫండ్ల‌లో మాత్ర‌మే పెట్టుబడిదారులు పైన పేర్కొన్న పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా పొందగలుగుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని