ప‌న్ను వ‌ర్తించని ఆదాయం ఏది?

ఆదాయ ప‌న్ను చ‌ట్ట ప్ర‌కారం, కొన్ని ర‌కాల ఆదాయంపై ప‌న్ను మిన‌హాయింపులు ఉంటాయి

Published : 16 Dec 2020 17:04 IST

ప‌న్ను వ‌ర్తించ‌ని… ప‌న్ను మిన‌హాయింపు ఆదాయానికి తేడా ఏంటి? ప‌న్ను మినహాయింపుల‌కి, ప‌న్ను వ‌ర్తించ‌ని ఆద‌యానికి చాలా తేడా ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు ఎన్ఆర్ఈ ఖాతాల ద్వారా వ‌చ్చే వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను వ‌ర్తించ‌దు. ప‌న్ను మిన‌హాయింపులు అంటే ఒక సంవ‌త్స‌రంలో వ‌చ్చిన ఆదాయం మొత్తానికి వ‌ర్తించే ప‌న్ను నుంచి త‌గ్గింపులు కోర‌డం. ఈపీఎఫ్‌, జీవిత బీమా పాల‌సీలు, వంటి వాటిలో పెట్టుబ‌డులు పెడితే సెక్ష‌న్ 80 సీ కింద మిన‌హాయింపులు ల‌భిస్తాయి.

ప‌న్ను ప‌రిధిలోకి రాని ఆదాయం:

  1. హెచ్ఆర్ఏ, ఎల్‌టీఏ

మీరు ఎల్‌టీఏ కోసం రూ.20 వేలు ఖ‌ర్చు చేస్తే దీన్ని మీ కంపెనీ వార్షికంగా మీకు వ‌ర్తించే ప‌న్ను ఆదాయం త‌గ్గించి ఇస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీ వార్షిక ఆదాయం రూ.4 ల‌క్ష‌లు అనుకుంటే ఎల్‌టీఏ మిన‌హాయిస్తుంది. అప్పుడు రూ.3,80,000 కే ప‌న్ను వ‌ర్తిస్తుంది.

  1. మ్యూచువ‌ల్ ఫండ్లు, స్టాక్స్, షేర్లు, క్యాపిట‌ల్ గెయిన్స్‌

మీరు మీ స్టాక్స్ కొనుగోలు చేసిన‌ రెండేళ్ల త‌ర్వాత విక్ర‌యించాల‌నుకుంటే అందులో వ‌చ్చిన మూల‌ధ‌న ఆదాయంపై ఎల్‌టీసీజీ ప‌డుతుంది. ఇది ఆదాయ ప‌న్నులోకి రాదు. ఈ లాభంతో ఏదైనా కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు కూడా ఆదాయ శాఖ మీ ఆదాయం ఎలా వ‌చ్చింద‌న్న‌ది ప‌రిశీలిస్తుంది.

  1. క్యాపిట‌ల్ గెయిన్స్

సెక్ష‌న్ 54, 54 ఎఫ్‌, 54ఈసీ కింద వివిధ ర‌కాలు ప‌న్ను మిన‌హ‌యింపులు ఉన్నాయి. దీనికోసం మీరు విక్ర‌యించే ఆస్తుల మీద వ‌చ్చే ఆదాయంపై సెక్ష‌న్ 54, 54 ఎఫ్‌, 54ఈసీ కింద వివిధ ర‌కాలు ప‌న్ను మిన‌హ‌యింపులు ఉన్నాయి. అయితే ప‌న్ను రిట‌ర్నుల స‌మ‌యంలో దీని గురించి తెలియ‌జేయాలి, లేక‌పోతే మీకు ఆదాయ శాఖ‌ నోటీసులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

  1. డివిడెండు ఆదాయం

సాధార‌ణంగా భార‌త కంపెనీలు ఇచ్చే డివిడెండు పైన ప‌న్ను వ‌ర్తించ‌దు. అయితే ఏడాదికి రూ.10 ల‌క్షల కంటే ఎక్కువ‌ డివిడెండు ల‌భిస్తే దానిమీద 10 శాతం ప‌న్ను వ‌ర్తిస్తుంది.

  1. పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌

మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత పీపీఎఫ్ నుంచి విత్‌డ్రా చేసుకుంటే ప‌న్ను వ‌ర్తించ‌దు. ఈపీఎఫ్‌లో ఐదేళ్ల త‌ర్వాత ఉప‌సంహ‌రించుకుంటే ప‌న్ను ప‌రిధిలోకి రాదు.

  1. పొదుపు ఖాతాపై వ‌డ్డీ

బ్యాంకు పొదుపు ఖాతాపై వ‌డ్డీకి సెక్ష‌న్ 80టీటీఏ కింద క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే ఇవి ఇత‌ర మార్గాల ద్వారా వ‌చ్చే ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు.

  1. ఎన్ఆర్ఈ ఖాతాపై వ‌డ్డీ

ఎన్ఆర్ఐల‌కి సంబంధించిన ఎన్ఆర్ఈ ఖాతాలో వ‌చ్చే వ‌డ్డీ ఆదాయంపై దేశంలో వ‌డ్డీ వ‌ర్తించ‌దు.

  1. జీవిత బీమా

సెక్ష‌న్ 10(10 డీ) కింద‌, జీవితా బీమా పాల‌సీ మెచ్యూరిటీ లేదా బోన‌స్ మీద ప‌న్ను ఉండ‌దు.

  1. బ‌హుమ‌తులు, వార‌స‌త్వంగా వ‌చ్చే ఆదాయం

వివాహాది శుభ‌కార్యాల‌లో వ‌చ్చే బ‌హుమ‌తుల‌కి లేదా వారస‌త్వంగా ల‌భించే దానిపై ప‌న్ను ఉండ‌దు. అయితే బందువులు కాకుండా ఇత‌రుల వ‌ద్ద‌నుంచి రూ.50 వేల‌కు మించి ఏదైనా బ‌హుమ‌తిగా పొందినా మొత్తంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

  1. వ్య‌వ‌సాయాధారిత ఆదాయం

వ్య‌వ‌సాయం ద్వారా వ‌చ్చే ఆదాయం రూ.5 వేలు ఉంటే ప‌న్ను ఉండదు. అయితే అది కూడా రిట‌ర్నుల‌ స‌మ‌యంలో ఐటీఆర్ 1 లో తెలియ‌జేయాలి. రూ.5 వేల కంటే ఎక్కువ‌గా ఉంటే ఐటీర్‌2 లో. దీనిని ఇత‌ర మార్గాల ద్వారా వ‌చ్చిన ఆదాయంతో క‌లిపి లెక్కిస్తారు. మీరు రూ.3 లక్ష‌లు ఇత‌ర ఆదాయం ఉంటే రూ.1 లక్ష వ్య‌వ‌సాయాధారిత ఆదాయం అయితే మొత్తం రూ.4 ల‌క్ష‌ల‌కు ప‌న్ను వేస్తారు. 

పైన చెప్పిన ఆదాయం పై ప‌న్ను వ‌ర్తించ‌న‌ప్ప‌టికీ వాటి గురించి రిట‌ర్నులు స‌మ‌యంలో తెలియ‌జేస్తే ఎలాంటి అవాంత‌రాలుండ‌వు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని