ఐటీఆర్‌ ఆలస్యంగా దాఖలు చేస్తే ఎదుర‌య్యే పరిణామాలు

డిసెంబర్ 31 లోపు దాఖలు చేస్తే, రూ.10,000 జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది

Updated : 02 Jan 2021 19:58 IST

మీ ఆదాయపు పన్నును నిర్ణీత తేదీకి లేదా అంత‌కుముందే దాఖలు చేయడం ఏదైనా పన్ను చెల్లింపుదారునికి చాలా ముఖ్యమైన పని. రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేస్తే, పన్ను చెల్లింపుదారులె చాలా ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు. తక్కువ మినహాయింపులను పొంద‌డ‌మే కాకుండా, జరిమానా కూడా చెల్లించాలి. అందువ‌ల్ల ఆల‌స్యంగా రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయకూడ‌దు. ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు ఆల‌స్యంగా దాఖ‌లు చేయ‌డం ద్వారా ఎదుర‌య్యే ప‌రిణాల‌ను తెలుసుకుందాం.

నష్టాలు:
ఇంటి ఆస్తి నుంచి నష్టాలు మిన‌హాయించి ఆదాయంలో ఇతర నష్టాలను రాబోయే సంవ‌త్స‌రాల్లో లెక్కించ‌లేము

సెక్షన్ 234 ఎ కింద వడ్డీ వసూలు: పన్ను చెల్లింపుదారుడు రిట‌ర్నులు దాఖలు చేయడంలో ఆలస్యం చేసినందుకు నెలకు 1 శాతం లేదా నెలలో కొంత భాగానికి సాధారణ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

ఆలస్యంగా దాఖలు చేసే రుసుము:
2018-19 మ‌దింపు సంవ‌త్స‌రం నుంచి దాఖలు చేసిన రిటర్నుల‌ కోసం సెక్షన్ 234 ఎఫ్ కింద ఆలస్యంగా దాఖలు రుసుము వర్తిస్తుంది. నిర్ణీత తేదీ తర్వాత రిటర్నులు దాఖలు అయితే అసెస్‌మెంట్ సంవత్సరంలో డిసెంబర్ 31 కి ముందు, రూ.5,000 ఆలస్యంగా దాఖలు రుసుము వసూలు చేస్తారు. డిసెంబర్ 31 లోపు దాఖలు చేస్తే, రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మొత్తం ఆదాయం రూ. 5 లక్షలకు మించకపోతే చెల్లించాల్సిన ఆలస్య దాఖలు రుసుము రూ. 1,000 కంటే ఎక్క‌వగా ఉండ‌దు.

తక్కువ ప్రయోజనాలు:
జరిమానా చెల్లించడమే కాకుండా, పన్ను చెల్లింపుదారుడు కూడా ఆ సంవత్సరానికి కొన్ని మినహాయింపులు, తగ్గింపులను వదిలివేయవలసి ఉంటుంది. ఐటీఆర్‌ ఆలస్యంగా దాఖలు చేస్తే లభించని మినహాయింపులు, తగ్గింపులు…

  • కొత్త సంస్థలకు సెక్షన్ 10 ఎ, సెక్షన్ 10 బి కింద మినహాయింపులు అందుబాటులో లేవు.
  • పారిశ్రామిక సంస్థలు లేదా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నిమగ్నమైన సంస్థలకు 80-IA, 80-IAB, 80-IB, 80-IC, 80-ID, 80-IE కింద మినహాయింపు అందుబాటులో ఉండ‌దు.
  • 80IAC, 80IBA, 80JJA, 80JJAA, 80LA, 80P, 80PA, 80QQB, 80RRB కింద తగ్గింపు ల‌భించ‌దు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని