పన్ను చెల్లింపుదార్లకు పాన్ ఎందుకు?
మదింపుదారుడికి సంబంధించిన అన్ని లావాదేవీలను గుర్తించడానికి పాన్ అనుమతిస్తుంది
మీరు పాన్ ను తరచుగా ఉపయోగిస్తుంటారు, కాని ఇది పన్ను శాఖ ఎందుకు జారీ చేస్తుందో మీకు తెలుసా? సంపాదించిన ఆదాయం, పన్ను మినహాయింపు, చెల్లించిన పన్ను, రాబడి, ఇతర లావాదేవీలతో సహా పన్ను మదింపుదారు అన్ని లావాదేవీలను గుర్తించడానికి పాన్ ఆదాయ విభాగాన్ని అనుమతిస్తుంది.
ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే వ్యక్తులు పాన్ పొందడం తప్పనిసరి. మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అయితే, రూ. 2.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది; సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు పైబడినవారు), రూ. 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆదాయ పన్ను వర్తిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి) రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయానికి పన్ను పడుతుంది.
పాన్ భారతదేశం అంతటా, మదింపుదారుడి జీవితకాలం చెల్లుతుంది. మదింపుదారుడి చిరునామా లేదా మదింపు అధికారి మారినప్పటికీ పాన్ గుర్తింపు మారదు. పాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు అందించిన వివరాలలో ఏదైనా మార్పు చేయాలనుకుంటే పన్ను విభాగానికి “Request For New PAN Card Or/And Changes or Correction in PAN Data" అనే ఫారం ద్వారా తెలియజేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి