సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కు పన్ను ప్రయోజనాలు

80 ఏళ్లు పైబ‌డిన‌వారికి రూ. 5 లక్షల వ‌ర‌కు మినహాయింపు ల‌భిస్తుంది

Published : 16 Dec 2020 17:40 IST

ఆదాయపు పన్ను చట్టం దేశంలోని సీనియర్ సిటిజన్లకు అనేక పన్ను ప్రయోజనాలను అందిస్తోంది. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని సీనియర్ సిటిజన్లు అని పిలుస్తారు, 80 ఏళ్లు పైబడిన వారిని వెరీ సీనియర్ సిటిజన్లు అంటారు. ఫారం 1 లేదా 4 ఉపయోగించి ఐటిఆర్ దాఖలు చేసే సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను రిటర్నుల‌ను దాఖ‌లు చేసేట‌ప్పుడు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. వీరికి ఆన్‌లైన్ ద్వారా ఫైలింగ్ కూడా అందుబాటులో ఉంది.

అలాగే, సీనియర్ సిటిజన్ ముందస్తు అడ్వాన్స్ ట్యాక్స్‌ నుంచి ఉపశమనం పొంద‌వ‌చ్చు. సెక్షన్ 207 ప్రకారం, ఒక సీనియర్ సిటిజన్, వ్యాపారం లేదా వృత్తి నుంచి ఎటువంటి ఆదాయాన్ని కలిగి ఉండకపోతే, ముందస్తు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. సీనియర్ కాని పౌరుల విషయంలో, సంవత్సరానికి అంచనా వేసిన పన్ను బాధ్యత రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్‌‌ చెల్లించాలి.

వైద్య వ్యయం, బీమాకు సంబంధించి పన్ను ప్రయోజనాలు
సీనియర్ సిటిజన్లు మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లిస్తే ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్షన్ 80 డి ప్ర‌కారం, రూ. 50,000 (60 ఏళ్లలోపు వారికి రూ. 25,000) అధిక మినహాయింపు పరిమితిని అందిస్తుంది.

సెక్షన్ 80 డిడిబి ప్ర‌కారం, ఒక వ్యక్తి సొంత వైద్య‌ ఖర్చులపై లేదా త‌మ‌పై ఆధార‌ప‌డిన‌వారికి చెల్లిస్తే చట్టంలో పేర్కొన్న విధంగా నిర్దిష్ట వ్యాధుల చికిత్సపై ఆధారపడి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఇది వాస్తవానికి చెల్లించిన మొత్తానికి లేదా రూ.40,000, ఏది తక్కువైతే అంత పొందవచ్చు. సీనియర్ సిటిజన్ విషయంలో గరిష్ట మినహాయింపు మొత్తం ల‌క్ష రూపాయ‌లు (60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి రూ. 40,000).

బ్యాంక్ డిపాజిట్ వడ్డీపై పన్ను ప్రయోజనం

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టిటిబి, సీనియర్ సిటిజన్ సంపాదించిన రూ. 50,000 వరకు బ్యాంకులు, పోస్టాఫీసు లేదా సహకార బ్యాంకులతో డిపాజిట్ల నుంచి వడ్డీ ఆదాయంపై పన్ను ప్రయోజనం ల‌భిస్తుంది. పొదుపు డిపాజిట్లు, స్థిర డిపాజిట్లపై సంపాదించిన వడ్డీ రెండింటిపై ఈ నిబంధన ప్రకారం మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 194 ఎ సంబంధిత నిబంధనలను ఇస్తుంది, బ్యాంకు, పోస్టాఫీసు లేదా సహకార బ్యాంకు వడ్డీ చెల్లింపుపై సీనియర్ సిటిజన్‌కు రూ.50,000 వరకు టీడీఎస్ వ‌ర్తించ‌దు. అందువల్ల ప్రతి బ్యాంకుకు వ్యక్తిగతంగా పరిమితిని లెక్కించాలి.

పన్ను రేట్లకు సంబంధించి ప్రయోజనాలు

సాధారణ పన్ను చెల్లింపుదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు, వెరీ సీనియర్ సిటిజ‌న్ల‌కు అధిక ప‌న్ను మినహాయింపు పరిమితి ఉంటుంది. మినహాయింపు పరిమితి అంటే ఒక వ్యక్తి పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేని ఆదాయ పరిమాణం.

సీనియర్ కాని పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్‌కు అధిక మినహాయింపు పరిమితి ఉంటుంది. నివాస సీనియర్ సిటిజన్‌కు మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలు (సీనియర్ కాని పౌరులకు రూ. 2.50 లక్షలు). వెరీ సీనియర్ సిటిజ‌న్‌కు రూ.5 లక్షల అధిక మినహాయింపు పరిమితి ల‌భిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని