రెండింటిలో ఏ ప‌న్ను విధానంతో మీకు ప్ర‌యోజ‌నం?

ఫిబ్రవరి 2020 లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్ధిక శాఖ ఆదాయపు పన్ను విషయం లో మరొక పన్ను విధానాన్ని కూడా ప్రవేశ పెట్టింది  

Published : 16 Dec 2020 19:01 IST

పాత పద్ధతిలో స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సి ( ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, జీవిత బీమా పాలసీ ప్రీమియం, ఎన్ఎస్సి, ఈఎల్ఎస్ఎస్, గృహ రుణం ఫై అసలు చెల్లింపు, 5 ఏళ్ల బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్, యులిప్స్ , ట్యూషన్ ఫీ వంటివి ), 80 డి (ఆరోగ్య బీమా ప్రీమియం), 80సిసిడి (ఎన్పీఎస్ చెల్లింపులు), ఇంటి అద్దె భత్యం , గృహ రుణ వడ్డీ వంటి మినహాయింపులు, తగ్గింపులు లభిస్తాయి.

అయితే కొత్త పద్ధతిలో ఎటువంటి మినహాయింపులు, తగ్గింపులు లేకుండా, వివిధ శ్లాబుల‌లో తక్కువ పన్ను లెక్కిస్తారు. వ్యక్తులు తమకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకోవచ్చు. ఏ పధ్ధతిని ఎంచుకుంటున్నారో ఆర్ధిక సంవత్సరం మొదట్లోనే తాము పనిచేసే సంస్థ వారికి రాత పూర్వకంగా ఇవ్వాలి . సంస్థ వారు ఆ పధ్ధతి లో పన్ను లెక్కించి, ఆ వ్యక్తి ఆదాయం నుంచి తీసి ప్రభుత్వానికి చెల్లిస్తారు. అయితే ఉద్యోగి పన్ను విధానాన్ని మార్చుకోదలచినట్లయితే , పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు మార్చుకోవచ్చు. తద్వారా పన్నులో సర్దుబాట్లు జరుగుతాయి . అయితే కొన్ని మినహాయింపులు సంస్థ ద్వారానే క్లెయిమ్ చేయొచ్చు. అందువలన రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ మినహాయింపులు పొందలేకపోవచ్చు. అధిక పన్ను చెల్లించినట్లయితే , రిటర్న్ దాఖలు చేసి , తిరిగి పొందొచ్చు . ఈ కింది పట్టిక ద్వారా పాత , కొత్త శ్లాబుల‌నుతెలుసుకుందాము.

Table 1:
income1.jpg
ఉదా : మోహన్ , వార్షిక ఆదాయం రూ. 8,25,000. అందులో బేసిక్ పే రూ. 4 లక్షలు, హెచ్ ఆర్ ఏ (HRA) రూ. 2లక్షలు. మోహన్ నెలకు రూ. 15 వేలు ఇంటి అద్దె చెల్లిస్తున్నాడు . అంటే వార్షిక అద్దె రూ. 1,80,000).
అయితే అతనికి లభించే మినహాయింపు రూ.1,40,000 మాత్రమే. HRA మినహాయింపు పొందేందుకు ఈ కింది మూడింటిలో ఏది తక్కువయితే అది ఉంటుంది :

  1. జీతం ద్వారా పొందిన HRA (రూ. 2 లక్షలు)
  2. చెల్లించిన అద్దె నుంచి బేసిక్ + డిఏ లో పది శాతం తీసివేయగా వచ్చిన మొత్తం (రూ.1,80,000 (-) రూ.40,000 = రూ.1,40,000)
  3. మెట్రో నగరాల్లో ఉంటుంటే బేసిక్ + డి ఏ లో 50 శాతం , లేక ఇతర ప్రదేశాల్లో ఉంటుంటే 40శాతం = రూ.4 లక్షల్లో 50
    శాతం రూ .2 లక్షలు.
    కాబట్టి తక్కువ మొత్తం రూ.1,40,000 లను పరిగణనలోకి తీసుకోవాలి. మోహన్ ప్రావిడెంట్ ఫండ్ కింద నెలకు రూ. 4 వేలు చెల్లిస్తున్నాడు. వార్షికంగా రూ. 48 వేలు. ఈ కింది పట్టిక ద్వారా మోహన్ ఎంత పన్ను వర్తిస్తుందో చూద్దాం :

Table 2:
income2.jpg
మోహన్ సెక్షన్ 80సి లో రూ 87,000 వరకు మదుపు చేసినట్లయితే , అతని పన్ను వర్తించే ఆదాయం రూ . 5 లక్షల లోపు అవుతుంది. రిటర్న్ దాఖలు చేయటం ద్వారా సెక్షన్ 87A కింద రూ. 12,500 ల పన్ను మినహాయింపు లభిస్తుంది. మోహన్ కి ఎటువంటి పన్ను ఉండదు.

చివరిగా : పాత పద్ధతిలో స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ 50,000, సెక్షన్ 80సి కింద రూ.1,50,000. సెక్షన్ సిసిడి(1బి) కింద రూ. 50,000, ఆరోగ్య బీమా ప్రీమియం కింద రూ 25,000 = మొత్తం రూ 2,75,000 లను పరిగణించి , వివిధ ఆదాయాలకు పాత, కొత్త విధానాలలో ఎంత పన్ను వర్తిస్తుందో ఈ కింది పట్టిక ద్వారా తెలుసుకుందాం. రెండింటిలో ఏ ప‌న్ను విధానంతో మీకు ప్ర‌యోజ‌నం

Table 3:
income3.jpg

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని