మీ భార్య పేరుతో ఇంటిని కొనుగోలు చేస్తున్నారా?

జీవిత భాగ‌స్వామి పేరున గృహం కొనుగోలు చేస్తే, ఆదాయ‌పు ప‌న్నుపై ప్ర‌భావం ఉంటుందా? తెలుసుకోండి.

Published : 16 Dec 2020 19:11 IST

మ‌నం క‌ష్ట‌పడి సంపాదించిన సొమ్మును ప‌న్నుల రూపంలో చెల్లించ‌డం ఇబ్బందికర విష‌య‌మే. అందువ‌ల్ల‌ ప‌న్ను మిన‌హాయింపును పొంద‌డానికి స‌హాయ ప‌డే ఐడియాల కోసం త‌ర‌చూ చూస్తుంటాము. జీవిత బీమా, ప‌బ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్‌, సూప‌ర్‌యాన్యుయేష‌న్ ఫండ్లు, మ్యూచువ‌ల్ ఫండ్‌ సిప్ వంటి వాటి ద్వారా ప‌న్ను మిన‌హాయింపును పొంద‌వ‌చ్చు. అయితే వీటిలో కొన్ని మంచి రాబ‌డుల‌ను అందించ‌లేవు. చాలా మంది ప్ర‌జ‌లు త‌మ జీవిత‌భాగ‌స్వామి పేరు మీద ఇంటిని కొనుగోలు చేస్తున్నారు, మ‌రికొంత మంది ఇంటిని కొనుగోలు చేయ‌డానికి ప్ర‌ణాళిక సిద్దం చేసుకుంటున్నారు. ఇది రిజిస్ట్రేష‌న్ స‌మ‌య‌ములో కొంత వ‌ర‌కు ఆదా చేయ‌డానికి వీలుక‌ల్పిస్తుంది. జీవిత భాగ‌స్వామి పేరున ఇంటిని కొనుగోలు చేయండం అంటే ఆ ఆస్తిని వారికి బ‌హుమ‌తిగా అందించ‌డం. కొన్ని రాష్రాల‌లో మ‌హిళ‌ల పేరిట ఆస్తి కొనుగోలు చేస్తే రిజిస్ట్ర‌ష‌న్ స‌మ‌యంలో స్టాంప్ డ్యూటీపై కొంత మిన‌హాయింపు ఉంటుంది. అందువ‌ల్ల భ‌ర్త త‌న భార్య పేరిట ఇంటిని కొనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారని " ఆప్టిమా మ‌నీ మేనేజ‌ర్స్" మేనేజింగ్ డైరెక్ట‌ర్ పంక‌జ్ మాత్పల్ అన్నారు. అయితే స్టాంప్ డ్యూటీలో మిన‌హాయింపు పొందుతున్న‌ప్ప‌టికీ భ‌విష‌త్త‌లో ప‌న్ను ప్ర‌యోజ‌నాలు కోల్పోతారు. అంతేకాకుండా జీవిత భాగ‌స్వామి పేరున‌ ఉన్న ఆస్తి నుంచి రాబ‌డి వ‌స్తున్న‌ట్ల‌యితే ఆ రాబ‌డి, ప‌న్ను క‌డుతున్న మొద‌టి వ్య‌క్తి ఆదాయానికి చేరుస్తారు కాబ‌ట్టి భ‌విష్య‌త్తులో మ‌రింత ఎక్కువ ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సి రావ‌చ్చు.

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 64, ఆదాయం క్ల‌బ్బింగ్ కోసం కేటాయించార‌ని ప్ర‌తీ ఒక్క‌రూ గుర్తుంచుకోవాలి. ఆస్తి నుంచి వ‌చ్చే ఆదాయం ఏదైనా (అద్దె ఆదాయం, మూల‌ధ‌న రాబ‌డి) ఆస్తి కొనుగోలుకు డ‌బ్బు చెల్లించిన వ్య‌క్తి ఆదాయంతో క‌లుపుతారు. ఇందుకోసం ఆ వ్య‌క్తి పేరు ఆస్తి ప‌త్రాల్లో వుండ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

అయినప్పటికీ, ఇంటి కొనుగోలు నిమిత్తం రుణం తీసుకున్నట్లయితే, ఈఎమ్ఐ వడ్డీ చెల్లింపులు, అసలు చెల్లింపులుపై పన్ను ప్రయోజనం పొందవచ్చు. సెక్షన్ 80 సీ కింద అసలు చెల్లింపుల‌కు, సెక్ష‌న్ 24బీ కింద వ‌డ్డీ చెల్లింపులకు మిన‌హాయింపు ల‌భిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని