వ్యక్తులకు జనవరి 10.. కంపెనీలకు ఫిబ్రవరి 15

ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. వ్యక్తులకు 10 రోజులు గడువు పొడిగిస్తూ.. జనవరి 10వ తేదీ వరకు రిటర్నులు

Updated : 31 Dec 2020 19:49 IST

ఆదాయపు పన్ను రిటర్న్‌ల గడువు పొడిగింపు

దిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. వ్యక్తులకు 10 రోజులు గడువు పొడిగిస్తూ.. జనవరి 10వ తేదీ వరకు రిటర్నులు సమర్పించే వీలు కల్పించింది. వ్యాపార సంస్థలు ఫిబ్రవరి 15 వరకు రిటర్న్‌లు దాఖలు చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ  తెలిపింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల గడువు తేదీని ప్రభుత్వం పొడిగించడం ఇది మూడో సారి కావడం గమనార్హం. వ్యక్తులు రిటర్న్‌లు దాఖలు చేసేందుకు తొలుత జులై 31 గడువు తేదీ కాగా.. దానిని నవంబరు 30వ తేదీకి, ఆ తర్వాత డిసెంబరు 31కి మార్పు చేసింది. ఇప్పుడు తాజాగా ఆ గడువును జనవరి 10వ తేదీకి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది..
వివాద్‌సే విశ్వాస్‌ డిక్లరేషన్‌కు గడువు జనవరి 31: ప్రత్యక్ష పన్నుల వివాద పరిష్కార పథకం వివాద్‌ సే విశ్వాస్‌ కింద డిక్లరేషన్‌ దాఖలు గడువు తేదీని కూడా నెల రోజులు పొడిగిస్తూ 2021 జనవరి 31 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీ వార్షిక రిటర్న్‌ల గడువును రెండు నెలల పాటు పొడిగించింది. 2021 ఫిబ్రవరి 28 వరకు దాఖలు చేయవచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని