Income Tax: ఆదాయపు పన్ను గడువు తేదీ ముగిస్తే...

గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబరు 31. అంటే నేడే. దీన్ని పొడిగిస్తారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాలి. సాధారణంగా....

Updated : 31 Dec 2021 10:12 IST

త ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబరు 31. అంటే నేడే. దీన్ని పొడిగిస్తారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాలి. సాధారణంగా ఏటా జులై 31లోపే ఈ గడువు ఉంటుంది. గత ఏడాది కొవిడ్‌-19 నేపథ్యంలో దీన్ని పెంచారు. ఈసారి ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణను మరింత సులభతరం చేసేందుకు కొత్త పోర్టల్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇందులో ఏర్పడ్డ కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో గడువు తేదీని డిసెంబరు 31 వరకూ పొడిగించారు. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారికి ఈ రోజు అవకాశం ఉంది. అయినప్పటికీ.. రిటర్నులు సమర్పించకపోతే.. మరో అవకాశమూ ఉంది. మదింపు సంవత్సరం అంటే 2021-22 ముగిసే మార్చి 31, 2022 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయొచ్చు. కానీ, దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.

గడువు లోపు రిటర్నులు దాఖలు చేయకపోతే.. మూలధన నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో సర్దుబాటు చేసుకునే అవకాశం కోల్పోతారు. వ్యాపార నష్టాలు, మూలధన రాబడి, నష్టాలతోపాటు, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ రూ.2,00,000లపైనా మినహాయింపు పొందడం సాధ్యం కాదు. దీంతోపాటు రిఫండుపైన రావాల్సిన వడ్డీలాంటివీ కోల్పోతాం.

జరిమానాతో...

అనివార్య కారణాలతో గడువు లోపు రిటర్నులు దాఖలు చేయని వారికి.. మార్చి 31 వరకూ అవకాశం ఉంది. కానీ, దీనికోసం కొంత జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

* పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలకు పైన ఉన్నప్పుడు ఈ జరిమానా మొత్తం రూ.5,000.

* పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల లోపు ఉంటే.. అపరాధ రుసుమురూ.1,000.

* రూ.10వేలకు మించి పన్ను చెల్లించాల్సి ఉన్నవారు.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకుండా, పన్ను ఎగవేతకు పాల్పడితే.. చట్టప్రకారం శిక్షార్హులు అవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని