Updated : 23 Dec 2020 17:28 IST

విదేశీ ద్ర‌వ్య మార్పిడికి 5 చిట్కాలు...

చాలా మంది పండుగ సెల‌వుల‌లో వారి కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి విదేశీ యాత్ర‌కు వెళ్ళాల‌ని అనుకుంటారు. ఇలా పండుగ సీజ‌న్లో విదేశాల‌కు వెళ్లాల‌నుకునే వారి కోసం విమాన‌యాన సంస్థ‌లు కూడా టిక్కెట్ల‌పై భారీ త‌గ్గింపును అందిస్తాయి. ఇది విదేశీ విహార‌యాత్ర‌లు వెళ్లాల‌నుకునే వారికి మ‌రింత ప్రోత్సాహాన్ని అందిస్తుంద‌ని చెప్పాలి. విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నప్పుడు ముందుగా ఆ దేశ క‌రెన్సీ అవ‌స‌రం ఉంటుంది. అంతర్జాతీయంగా లావాదేవీలు, వ్యాపార చెల్లింపులు మొద‌లైన వాటికి ద్ర‌వ్య మార్పిడి చాలా అవ‌స‌రం. ద్ర‌వ్య మార్పిడి చేసేందుకు వివిధ మార్గాలు ఉంటాయి. వాటిలో మ‌న‌కు అనుకూలంగా ఉండే విధానాన్ని ఎంచుకోవ‌డం ద్వారా త‌క్కువ రుసుముతో ద్ర‌వ్య మార్పిడి చేసుకునే వీలుంటుంది. విదేశీ మార‌క ద్ర‌వ్య సేవ‌ల‌ను బ్యాంకులు, ఆన్‌లైన్ ఎక్స్‌ఛేంజ్ సంస్థ‌లు అందిస్తుంటాయి. దీనికి కొంత స‌మ‌యం, న‌గ‌దు రెండింటిని ఖ‌ర్చుపెట్ట‌వ‌ల‌సి వ‌స్తుంది. స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే విదేశీ ద్ర‌వ్య‌ మారకానికి చెల్లించే రుసుములు అధికం కావ‌చ్చు.

విదేశీ ద్ర‌వ్యమార్పిడిని సుల‌భ‌త‌రం చేసే 5 మార్గాలు:

  1. ఫీజులను పోల్చిచేసుకోవ‌డం:

ముందుగా ఎక్స్ఈ యాప్, ఎక్స్ఈ క‌న్వ‌ర్ట‌ర్ ద్వారా ఆ స‌మ‌యానికి మార్కెట్ ఎక్స్‌ఛేంజ్ రేటు ఎంతుందో తెలుసుకోవాలి. అనంత‌రం బ్యాంకులు, ఎక్స్‌ఛేంజ్ సంస్థ‌లు, ఆన్‌లైన్ ఎక్స్‌ఛేంజ‌ర్స్‌ అందించే రేట్లు, ఫీజులను పోల్చి చూసుకుని మంచి డీల్‌ను ఎంపిక చేసుకోవాలి.

  1. విదేశీ మార‌క ద్ర‌వ్యాల‌ను, వ్యయాలను అర్థం చేసుకోవ‌డం:

కొన్ని సంస్థ‌లు వ‌సూలు చేసే రుసుములు పారదర్శకంగా ఉంటాయి. మ‌రికొన్ని క‌నిపించ‌కుండా అధిక రుసుములు వ‌సూలు చేస్తుంటాయి. అందువల్ల ఇత‌ర కంపెనీల మాదిరిగానే మీరు ఎంచుకున్న కంపెనీ కూడా చార్జీల‌ను విధిస్తుందో లేదో స‌రిచూసుకోవాలి. కొన్ని విదేశీ మార‌క ద్ర‌వ్య కంపెనీ లాభాలే ల‌క్ష్యంగా ప‌నిచేస్తుంటాయి. అందువ‌ల్ల విదేశీ మార‌క ద్ర‌వ్య విలువ‌ను అందుకు అయ్యే ఖ‌ర్చుల‌ను ముందుగానే తెలుసుకోవాలి.

క‌రెన్సీ ఎక్స్‌చేంజ్ చేసేట‌పుడు మూడు ర‌కాలుగా ఫీజులు చెల్లించాలి:

  • ప్లాట్ ఫీజు, హ్యాండ్లింగ్ ఫీజు, క‌నీస ఛార్జీలు మొద‌లైన‌ రుసుములు వ‌సూలు ఉంటాయి.

  • ఒక రేటు వద్ద కరెన్సీ కొనుగోలు చేసి దాని కొంత మార్జిన్ క‌లుపుకుని వేరొక‌రికి విక్ర‌యించ‌డం ద్వారా ఎక్స్‌ఛేంజ్ సంస్థ‌లు లాభాల‌ను పొందుతాయి. దీన్ని స్ప్రెడ్ అంటారు.

  • ద్ర‌వ్య మార్ప‌డి సేవ‌లు అందించే సంస్థ‌లు, ఆ మొత్తాన్ని వినియోగ‌దార్లు పేర్కొన్న‌ ఖాతాకు బ‌దిలీ, వైర్ ట్రాన్స్‌ఫ‌ర్స్‌, ఇత‌ర డెలివ‌రీ ప‌ద్ద‌తుల‌కు ఫీజులు వ‌సూలు చేస్తుంటారు.

ద్ర‌వ్య మార్పిడి విలువ‌ను ఎక్స్ఈ ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ క్యాలిక్యులేట‌ర్, ఎక్స్ఈ క‌రెన్సీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోడం వంటి వాటి ద్వారా ప్రొవైడ‌ర్ ధ‌ర‌ల‌ను చూసుకోవ‌చ్చు.

  1. మీ లావాదేవీలను ఏకీకరించండి:

ద్ర‌వ్య మార్పిడి చేసేట‌ప్ప‌డు మీరు చేసే ప్ర‌తీ లావాదేవీల‌కు చార్జీలు వ‌ర్తిస్తాయి. వీటిక‌య్యే ఖ‌ర్చులు కొన్ని సంద‌ర్భాల్లో త‌క్కువ‌, మ‌రి కొన్ని సార్లు ఎక్కువగా ఉండ‌వ‌చ్చు. ఇది మీరు చేసే లావాదేవీల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. కాబ‌ట్టి మీరు చేసే అనేక ర‌కాల న‌గ‌దు బ‌దీలీల‌ను ఒకే లావాదేవీ కింద‌కు తీసుకు రావ‌డం ద్వారా ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌చ్చు. కొంతమంది విదేశీ ఎక్స్‌ఛేంజ్ ప్రొవైడ‌ర్లు వారి క‌మీష‌న్‌, ఫీజుల‌ను త‌గ్గించుకుని మంచి రేట్ల‌కు క‌రెన్సీ మార్పిడి సేవ‌ల‌ను అందిస్తుంటారు. అలాంటి వాటిని ఎంచుకోవాలి.

  1. నకిలీల ప‌ట్ల‌ జాగ్రత్త వహించండి:

నకిలీ కరెన్సీ స‌మ‌స్య అన్ని క‌రెన్సీల్లో ఉంటుంది.కొన్ని దేశాల‌లో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంది. నకిలీలను నివారించడానికి, ముందుగానే ఆ కరెన్సీ రూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాటర్ మార్క్‌లు, ఇతర భద్రతా లక్షణాలను గమనించండి. దీని ద్వారా కొంత వ‌ర‌కు న‌క‌లీల‌ను గుర్తించ‌డం సాధ్యం అవుతుంది. కొన్ని ప్ర‌దేశాల‌లో మ‌నం గుర్తించ‌లేని స్థాయిలో న‌కిలీ క‌రెన్సీ ఉండ‌వ‌చ్చు. న‌మ్మ‌క‌మైన వీదేశీ మార‌క ద్ర‌వ్య సంస్థ‌ను ఎంచుకోవ‌డం ద్వారా ఈ స‌మ‌స్య రాకుండా చూసుకోవ‌చ్చు.

  1. ఎక్కువ స‌మ‌యం కోసం ద్ర‌వ్య మార్పిడి:

అంత‌ర్జాతీయంగా విద్య‌ను అభ్య‌సించ‌డం కోసం, ఎక్కువ కాలం విదేశాల‌లో గ‌డ‌ప‌డం కోసం విదేశాల‌కు వెళ్లే వారికి న‌గ‌దు లావాదేవీలు ఎక్కువ‌గా ఉంటాయి. స్ధానికంగా ఉండే బ్యాంకులో ఖాతా తెరిచి లావాదేవీలు చేయ‌డం మంచిది. లావాదేవీలు సుర‌క్షితంగా ఉండ‌ట‌మే కాకుండా ప్ర‌క్రియ‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తుంది. క‌రెన్సీ హెచ్చుత‌గ్గుల వ‌ల్ల ఏర్ప‌డే ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంది

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్