ఎన్ఆర్ఐల‌కు ఆర్థిక ప్ర‌ణాళిక‌

విదేశాల్లోనే స్థిర‌ప‌డాల‌నుకుంటున్న ఎన్ఆర్ఐల‌కు లేదా తిరిగి భార‌త్‌కు వ‌చ్చేయాల‌నుకునేవారికి ఆర్థిక ప్ర‌ణాళిక ఎలా ఉండాలో తెలుసుకోండి

Published : 15 Dec 2020 19:48 IST

విదేశాల్లో ఉండే భార‌తీయుల‌కు తిరిగి వ‌స్తారా లేదా అక్క‌డే స్థిర‌ప‌డ‌తారో తెలియ‌క‌ పెట్టుబ‌డుల విష‌యంలో నిర్ణ‌యం తీసుకునేందుకు గంద‌ర‌గోళం ఏర్ప‌డుతుంది. అక్క‌డ ఉండే విధంగా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోవాలా లేదా తిరిగి వ‌చ్చేవిధంగా చేసుకోవాలా అర్థం కాదు. 7 శాతం రాబ‌డినందించే ఎన్ఆర్ఈ ఎఫ్‌డీల‌లో పెట్టుబ‌డులు పెట్టాలా? లేదా అంత‌ర్జాతీయంగా ఈక్విటీల‌లో 4-6 శాతం రాబ‌డినిచ్చే వాటిలో పెట్టుబ‌డులు పెట్టాలా? వంటి ఎన్నో సందేహాలు ఉంటాయి.

విదేశాల్లో స్థిర‌ప‌డేవారికి ఆర్థిక ప్ర‌ణాళిక‌:

1.అత్య‌వ‌స‌ర నిధి అవ‌స‌రానికి మించి ఉండాలి

విదేశాల్లో నివ‌సిస్తుంటే బందువులు, తెలిసిన‌వారు మిమ్మ‌ల్ని ధ‌న‌వంతుడిగా భావిస్తారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో మీరు వారిని ఆదుకుంటార‌నే ఆశిస్తుంటారు. అలాంట‌ప్పుడు మీరు ఇప్ప‌టికీ ఇంకా అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటుఉ చేసుకోక‌పోతే, అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం పెట్టుబ‌డులు చేస్తున్న నిధి నుంచి తీసి ఖ‌ర్చు చేయాల్సి రావ‌చ్చు.

  1. పెట్టుబ‌డులు ఎక్కువ‌గా దేశంలో ఉండాలి

మీకు ఇక్క‌డ ఇళ్లు లేదా ఏవైనా ఇత‌ర ఆస్తులు ఉండాలి. భార‌త ఈక్విటీల‌లో పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (పీఐఎస్) ఖాతా క‌లిగి ఉండాలి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌తో పాటు ఇత‌ర పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి. మీరు విదేశాల్లో స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న‌ప్ప‌టికీ పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక ఇక్క‌డ నివ‌సించేందుకు స‌రిపోయేదిగా ఉండాలి. దీంతో ఎప్పుడైనా మీరు భార‌త్‌కి తిరిగి వ‌చ్చేయాల్సి వ‌స్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. భార‌త ఈక్విటీల‌లో అనిశ్చితి ఎక్కువగా ఉంటుంది. ఇత‌ర దేశ‌ల్లో పోఉలిస్తే ఎక్స్‌ఛేంజ్ రేట్లు, ప‌న్ను రేట్ల‌లో మార్పులు ఉంటాయి. ఇంలాంటప్పుడు ఈక్విటీల‌ను విక్రయించిన‌ప్పుడు, ఎఫ్‌డీల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ప్పుడు వచ్చే లాభాలు అక్క‌డే ఆవిర‌య్యే అవ‌కాశం ఉంటుంది. బార‌త ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం ఎన్ఆర్ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ప‌న్ను ఉండ‌దు. ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన ఆదాయంపై ప‌న్ను ఉంటుంది.

3. మీ స్థాన‌చ‌ల‌నం పెట్టుబ‌డుల‌పై ప్ర‌భావం చూప‌వ‌చ్చు

విదేశాల్లో సంపాదించిన త‌ర్వాత చాలా కాలం అద్దె చెల్లించిన త‌ర్వాత ఇల్లు కొనుగోలు చేసేవిధంగా ఆలోచిస్తారు. కానీ ఆలోపే చాలా మొత్తంలో మీ డ‌బ్బు వృథా అవుతుంది. అదేవిధంగా డ‌బ్బును ఉంచుకొని దేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు స‌రైన స‌మ‌యం కోసం వేచి చూస్తుంటారు. ఇది స‌రైన విధానం కాద‌నే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక‌వేళ ఎక్కువ కాలం అక్క‌డే ఉండాల్సి వ‌స్తే ల‌క్ష్యాల కోసం ఏర్పాటు చేసుకునే నిధి త‌గ్గుతుంది.

ఎన్ఆర్ఐల‌కు ఆర్థిక ప్ర‌ణాళిక‌
1.అధిక మొత్తంలో అత్య‌వ‌స‌ర నిధి త‌ప్ప‌నిసరి
స్వ‌దేశంలో ఎక్కువ మొత్తంలో అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు చేసుకోవ‌డం మంచిది. యూకే లో సాధార‌ణంగా 3 నుంచి 6 నెల‌ల‌కు స‌రిప‌డా డ‌బ్బును అత్యవ‌స‌ర నిధిగా ఉంచుకోవాల‌ని సూచిస్తారు. అయితే అక్క‌డ ఆరోగ్య ఖ‌ర్చులు త‌క్కువ‌గా ఉంటాయి. పెద్ద‌వారికి ప్ర‌భుత్వ పెన్ష‌న్ ఉంటుంది కాబట్టి ఎవ‌రిపై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అదే భార‌త్‌లో అయితే మ‌న‌మీద ఆధార‌ప‌డిన‌వారిని చూసుకోవాల్సిన బాధ్య‌త ఉంటుంది.దీంతో పాటు ఇక్క‌డ వైద్య ఖ‌ర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అందుకే రెండు ర‌కాల అత్య‌వ‌స‌ర నిధుల‌ను వేర్వేరుగా ఏర్పాటు చేసుకోవాలి. దేశంలో అయితే దీనిని మ‌ల్టీ-అసెట్ ఫండ్‌లో, యూకేలో అయితే బ్యాంక్ ఖాతాలో జ‌మ‌చేసుకోవ‌చ్చు.

2.అద్దె చెల్లించ‌డం కంటే ఇల్లు కొన‌డం మంచిది
విదేశాల్లోనే స్థిర‌ప‌డ‌తామో లేదా తిరిగి రావాల్సి ఉంటుందో తెలియ‌క చాలామంది ఇల్లు కొనుగోలు చేయ‌డం ఎందుక‌ని అద్దె చెల్లిస్తుంటారు. అద్దె ఇంట్లో 16-18 నెల‌లు ఉంటే భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లో ఇప్పుడు ఇంటి రుణంపై వ‌డ్డీ రేట్లు కూడా త‌క్కువ‌గా ఉన్నాయి. అక్క‌డ ఆస్తి చట్టాలు మరింత కఠినమైనవి. దీంతోపాటు ఆస్తి కొనుగోలు లావాదేవీలు న్యాయవాదులు / నిపుణులు నిర్వహిస్తారు కాబ‌ట్టి సురక్షితంగా ఉంటాయి. విదేశాల్లో స్థిర‌ప‌డిన‌ పెట్టుబడిదారుల నుంచి లండ‌న్‌లో అధిక స్థాయిలో ప్రాప‌ర్టీ పెట్టుబ‌డులు వ‌స్తాయి.

3.కుదిరితే వ్యాపారం చేయండి
వ్యాపారం చేయ‌డం అంటే కార్యాల‌యాల‌ను తీసుకొని ఉద్యోగుల‌ను నియ‌మించుకోవాల‌ని కాదు. కాంట్ర‌క్ట‌ర్లు లేదా తాత్కాలిక లేబ‌ర్ కొన్ని క‌ప కంపెనీల్లో ట్రేడింగ్ వంటివి చేసుకోవ‌చ్చు. కేవ‌లం ప‌న్ను ఆదా కోస‌మే వ్యాపారం చేయ‌డం మంచిది కాదు. మీ పెట్టుబ‌డులు ఆర్థిక ప్ర‌ణాళిక‌కు స‌రిపోయేలా ఉండాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో భార‌త్‌లో మీరు పెట్టిన పెట్టుబ‌డుల‌కు మెచ్యూరిటీ ముగిస్తే, ఆ ఏడాది వ్యాపారం నుంచి త‌క్కువ వ్య‌క్తిగ‌త ఆదాయం పొందితే అప్పుడు ప‌న్ను త‌క్కువ‌గా ప‌డుతుంది.

4.దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులు
లాక్‌-ఇన్ పీరియ‌డ్ కార‌ణంగా ప‌న్ను ఆదా చేసే పథ‌కాల‌లో లేదా పెన్ష‌న్ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు చేయ‌క‌పోవ‌డం స‌రైన విష‌యం కాదు. యూకేలో పెన్ష‌న్ పెట్టుబడుల‌కు 45 శాతం ప‌న్ను రాయితీ ఉంటుంది. భారతదేశానికి తిరిగి రావాలంటే సమానమైన భారతీయ పెన్షన్ పథకానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. వెంచ‌ర్ క్యాపిట‌ల్ ట్ర‌స్ట్ స్కీముల్లో యూకేలో 30 శాతం ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ప్ర‌భుత్వం ఇచ్చే ప్ర‌యోజ‌నాల‌ను ఉప‌యోగించుకోకండా విదేశాల్లో సంప‌ద‌ను సృష్టించుకోవ‌డం అంటే స‌రైన నిర్ణ‌యం కాదు. అంటే ఆర్థిక స్వ‌తంత్రం పొందే ముందు మీరు తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. అయితే మెచ్యూరిటీ పూర్తి కాక‌ముందే స్వ‌దేశానికి తిరిగి వ‌స్తే ప‌న్నులు వ‌ర్తిస్తాయి. అయితే ప్ర‌ణాళిక ప్ర‌కారం పెట్టుబ‌డులు ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు.

5.దేశంలో పెట్టుబ‌డులు
భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ వేగంగా పుంజుకుంటుంద‌న్న విష‌యం తెలిసిందే. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌తో పోలిస్తే ఇక్క‌డ ఈక్విటీల్లో పొందే లాభాలు ఎక్కువ‌ని చెప్పుకోవ‌చ్చు. అయితే రిస్క్ కూడా ఎక్కువ‌గానే ఉంటుది. విదేశాల్లో నివ‌సించేవారికి ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డైనా పెట్టుబ‌డులు పెట్టుకునే అవ‌కాశం ఉంటుంది. Vanguard passive funds and Blackrock exchange traded funds (ETFs) ద్వారా పెట్టుబ‌డులు త‌క్కువ ఖ‌ర్చుతో కూడుకొని ఉంటాయి. డెట్ పెట్టుబ‌డుల్లోకి వ‌స్తే అంత‌ర్జాతీయ బాండ్ల‌తో పోలిస్తే దేశీయ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల‌పై అధిక రాబ‌డి వ‌స్తుంది.

6.విదేశాల్లో ఆర్థిక స‌ల‌హాదారుని ఎంచుకోండి
విదేశాల్లో స్థిర‌ప‌డాల‌నుకుంటున్న భార‌తీయులు అక్క‌డే మంచి ఆర్థిక స‌ల‌హాదారుని వ‌ద్ద సూచ‌న‌లు తీసుకోవ‌డం మేలు. విదేశాల్లో అనేక ప‌న్ను ఆదా చేసే ప‌థ‌కాలు ఉన్నాయి వాటిని స‌ద్వినియోగం చేసుకోవాలి. తిరిగి వ‌చ్చేయాల‌నుకునేవారికంటే అక్క‌డే స్థిర‌ప‌డేల‌నుకునేవారికి ఇవి ప్ర‌యోజ‌ర‌క‌రంగా ఉంటాయి. తిరిగి రావాల‌నుకునేవారు ఇక్క‌డ ఒక‌ ఆర్థిక స‌ల‌హాదారుని సూచ‌న‌ల‌ను పాటించ‌డం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని