Global Health IPO: నవంబరు 3న గ్లోబల్‌ హెల్త్‌ ఐపీఓ

Global Health IPO: మేదాంతా పేరిట ఆస్పత్రులను నిర్వహిస్తున్న గ్లోబల్‌ హెల్త్‌ లిమిటెడ్‌ వచ్చే నెల 3న ఐపీఓకి రానుంది. ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్పత్రుల సామర్థ్యం 3,500 పడకలు.

Updated : 21 Nov 2022 16:43 IST

దిల్లీ: మేదాంతా బ్రాండ్‌ పేరిట ఆస్పత్రులను నిర్వహిస్తున్న ‘గ్లోబల్‌ హెల్త్ లిమిటెడ్’ ఐపీఓ (Global Health Limited IPO) నవంబరు 3న ప్రారంభం కానుంది. షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ నవంబరు 7న ముగియనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూలో రూ.500 కోట్లు విలువ చేసే తాజా షేర్లను జారీ చేయనున్నారు. అలాగే 5.08 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) కింద విక్రయించనున్నారు.

ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా అనంత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, సునీల్‌ సచ్‌దేవ తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించనున్నారు. ప్రస్తుతం అనంత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు గ్లోబల్‌ హెల్త్‌లో 25.67 శాతం, సచ్‌దేవకు 13.43 శాతం వాటాలున్నాయి. ఐపీఓలో సమీకరించిన నిధులతో రుణ భారాన్ని తగ్గించుకోనున్నారు. అలాగే సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కూడా కొన్ని నిధుల్ని వెచ్చించనున్నారు. ఈ సంస్థను ప్రముఖ హృద్రోగ వైద్యనిపుణులు నరేశ్‌ ట్రెహాన్‌ స్థాపించారు. ఉత్తర, తూర్పు భారత్‌లో ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. గురుగ్రామ్‌, ఇండోర్‌, రాంచీ, లఖ్‌నవూ, పట్నాలో మేదాంతా ఆస్పత్రులు ఉన్నాయి. మరొకటి నోయిడాలో నిర్మాణ దశలో ఉంది. 2025 నాటికి దీంట్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్పత్రుల సామర్థ్యం 3,500 పడకలు. 2022 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం రూ.2,205.8 కోట్లుగా నమోదైంది. లాభం రూ.196.2 కోట్లుగా నివేదించింది. కొటాక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, క్రెడిట్‌ సూయిజ్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా), జెఫరీస్‌ ఇండియా, జేఎం ఫైనాన్షియల్‌ ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు