ప్రీమియంలో లిస్ట్ అయిన గ్లోబల్‌ సర్ఫేసెస్‌ షేర్‌

ఐపీఓ ముగిసిన వారానికే అధిక ధరకు లిస్టయిన గ్లోబల్‌ సర్ఫేసెస్‌ షేర్‌ ధర.

Published : 23 Mar 2023 17:24 IST

దిల్లీ: గ్లోబల్‌ సర్ఫేసెస్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌  మార్చి 15తో ముగిసింది. ఈ రోజు (మార్చి 23)న ఈ కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో ఒక్కోక్కటి రూ.164 చొప్పున లిస్ట్ అయ్యాయి. ఐపీఓ ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.140తో పోలిస్తే, ఇప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన ధర 17% కంటే ఎక్కువ. బీఎస్‌ఈలో కూడా గ్లోబల్‌ సర్ఫేసెస్‌ షేర్లు ఒక్కొక్కటి రూ.163 ధర వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి గ్లోబల్‌ సర్ఫేసెస్‌ షేరు ధర రూ.171గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని