Result: గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ నికర లాభంలో 58% వృద్ధి

గోద్రెజ్‌ ప్రాపర్జీస్‌ తన 4వ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Updated : 03 May 2023 18:17 IST

దిల్లీ: గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 4వ త్రైమాసికంలో నికర లాభం 58% వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ నికర ఆదాయం 31% వృద్ధి చెంది రూ.1,930 కోట్లకు పెరిగింది. 2022, 4వ త్రైమాసికంలో ఇది రూ.1,476 కోట్లుగా ఉంది. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ EBITDA 2023, 4వ త్రైమాసికంలో రూ.630 కోట్లకు పెరిగింది. 2022, 4వ త్రైమాసికంలో ఇది రూ.403 కోట్లు. సమీక్షిస్తున్న త్రైమాసికంలో పన్నుకు ముందు లాభం 61% వృద్ధితో రూ.570 కోట్లుగా ఉంది. క్రితం సంవత్సరం త్రైమాసికంలో ఇది రూ.354 కోట్లు. 2023, 4వ త్రైమాసికంలో 6 నగరాల్లో 5.25 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణం, 12 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించి అత్యధిక త్రైమాసిక విక్రయాలు జరిపింది. ప్రాజెక్టుల బుకింగ్‌ విలువ రూ.4,051 కోట్లుగా ఉంది. కంపెనీ 4 నగరాల్లో 5 కొత్త రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులను జోడించింది. దీని బుకింగ్‌ విలువ రూ.5,750 కోట్లగా అంచనా. భవిష్యత్‌లో సంస్థ రూ.32 వేల కోట్ల బుకింగ్‌ విలువ అంచనాతో 18 ప్రాజెక్టులను జోడించడం ద్వారా తన వ్యాపారాన్ని మరింత విస్తరించనున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు