తగ్గిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయంగా పసిడి ధరలు క్షీణించడంతో దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.232 తగ్గి..

Published : 03 Feb 2021 17:41 IST

దిల్లీ: అంతర్జాతీయంగా పసిడి ధరలు క్షీణించడంతో దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.232 తగ్గి రూ.47,387 వద్ద ముగిసింది. వెండి సైతం కేజీకి రూ.1,955 తగ్గి రూ.67,605 వద్ద ముగిసింది. డాలరు విలువ బలపడడం, ఈక్విటీ మార్కెట్లు రాణిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గుముఖం పడుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1835 డాలర్లు ఉండగా.. వెండి ఔన్స్‌ ధర 26.78గా ఉంది. 

ఇవీ చదవండి..
ఇ-కేవైసీతో ఎన్‌పీఎస్ ఖాతా తెర‌వ‌వ‌చ్చు
బుల్‌ హ్యాట్రిక్‌.. సెన్సెక్స్‌ 50,000+

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని