Gold Loan: ఆన్‌లైన్‌లోనూ బంగారు రుణాలు
ఏ ఇతర రుణంతో పోల్చి చూసుకున్నా కూడా బంగారు రుణాలపై వడ్డీ తక్కువ. రుణ మంజూరు వేగంగా అవ్వడమే కాకుండా అనేక సౌలభ్యాలు ఉన్నాయి, అవేంటో చూడండి.
ఇంటర్నెట్ డెస్క్: అత్యవసర సమయంలో డబ్బు కొరత ఎవరికైనా ఏర్పడవచ్చు. ఇలాంటి సమయంలో రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. అధిక మొత్తాలు చేబదులుగా ఎవరూ ఇవ్వరు. వ్యక్తిగత రుణం ప్రయత్నిద్దామన్నా దీనికి మెరుగైన క్రెడిట్ స్కోరు అవసరం. ఇలాంటి సందర్భంలో వెంటనే ఆదుకునేది బంగారం మీద రుణం. చాలా భారతీయ కుటుంబాలు ఏదో ఒక రూపంలో బంగారాన్ని కలిగి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో బంగారంపై రుణాన్ని పొందడం అనేది వీరికి సరైన ఆప్షన్.
డిజిటల్ రుణాలు
గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ప్రతి ఒక్కరికీ ఫైనాన్సింగ్‌ను సులభతరం చేసే డిజిటల్ రుణాలు గణనీయంగా పెరిగాయి. ఇది సులభంగా మొబైల్ పరికరాలతో యాక్సెస్ చేయవచ్చు. తక్కువ పేపర్ వర్క్ ఉంటుంది. అర్హత తనిఖీలు కూడా సులభంగా ఉంటాయి. భారత్‌లో బంగారు రుణాల వ్యాప్తి రేటు 2022లో 3.3% నుంచి 4 శాతానికి పెరిగింది. ఇది భారతీయ మార్కెట్లో పెరుగుతున్న బంగారు రుణాల లభ్యతను స్పష్టంగా సూచిస్తోంది.
తక్షణ రుణ ఆమోదం
నిధులు వెంటనే అవసరమైనప్పుడు..'టెక్-ఎనేబుల్డ్ సొల్యూషన్'ల ఆగమనంతో బంగారు రుణాలు సరళమైన, అత్యంత సురక్షితమైన ఫైనాన్సింగ్ అవకాశాలలో ఒకటిగా మారాయి. ఈ రోజుల్లో డిజిటల్ బంగారు రుణాలు మొత్తం ప్రక్రియను చాలా సులభతరం చేశాయి. ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తిచేయడం, ఆన్‌లైన్‌లోనే పత్రాలను సమర్పించడం మాత్రమే చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత బంగారం స్వచ్ఛతను నిర్ధారించడానికి, కొన్ని పత్రాలను ధ్రువీకరించడానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంటికి వస్తారు. ఈ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత రుణం నిమిషాల్లో రుణగ్రహీత బ్యాంకు ఖాతాలోకి బదిలీ అయిపోతుంది. మొత్తం ప్రక్రియకు సాధారణంగా 30 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది.
అర్హత
ఇతర ఫైనాన్సింగ్ ఎంపికలతో పోలిస్తే.. గోల్డ్‌లోన్ కోసం అర్హత పరిమితులు చాలా సరళంగా ఉంటాయి. ఆదాయ రుజువు అవసరం లేదు. వ్యక్తిగత, గృహ లేదా ఇతర రుణాల కోసం రుణగ్రహీత క్రెడిట్ స్కోరు ఆధారంగా రుణ ఆమోదం ఉంటుంది. అయితే, బంగారు రుణాల విషయంలో ఇలా కాదు. ఇక్కడ రుణం మొత్తం బంగారం మార్కెట్ విలువ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇది అత్యంత సులభంగా యాక్సెస్ చేయగల ఫైనాన్సింగ్ ఎంపికల్లో ఒకటి.
అధిక రుణ విలువ
ఈ రుణాలు అధిక లోన్-టు-వాల్యూ రేషియో (LTV) కలిగి ఉంటాయి. ఆర్‌బీఐ ఆదేశం ప్రకారం బంగారం మార్కెట్ విలువలో 75% వరకు క్రెడిట్ పొందొచ్చు. ఉదాహరణకు రూ.20 లక్షల విలువైన బంగారానికి రూ.15 లక్షల విలువైన రుణాన్ని పొందొచ్చు. పరిమితి ప్రకారం రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తక్కువ వడ్డీ రేట్లు
వ్యక్తిగత రుణాలు, ఆస్తిపై రుణాలు, వ్యాపార రుణాలు, కార్పొరేట్ రుణాలు మొదలైన వాటితో పోల్చుకుంటే ఈ బంగారు రుణాలు తక్కువ వడ్డీ రేటుతో లభిస్తాయి. గోల్డ్ లోన్స్ 7% వడ్డీ రేటు నుంచి మొదలవుతున్నాయి. తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి లేదా ఇల్లు కొనడానికి మార్జిన్ మనీ కోసం నిధులను సేకరించాలనుకునే వ్యక్తులు అధిక-వడ్డీ రేట్లు చెల్లించడం గురించి చింతించాల్సిన అవసరం లేకుండా బంగారు రుణాల కోసం వెళ్లవచ్చు.
సులభంగా రుణ చెల్లింపులు
కొన్ని గోల్డ్ లోన్ ప్లాన్‌లలో రుణగ్రహీతలు లోన్ వ్యవధిలో కేవలం వడ్డీ మొత్తాన్ని మాత్రమే చెల్లించవచ్చు. చివరిలో అసలు మొత్తాన్ని చెల్లించవచ్చు. మరోవైపు, వారు ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లించుకోవచ్చు. అంటే గడువులోపు డబ్బు ఉన్నప్పుడే ఆ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఈ సౌకర్యం వల్ల బంగారు రుణం తీసుకున్న వ్యక్తులు తమ ఆర్థిక వ్యవహారాలను ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.
చివరిగా: పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు బంగారాన్ని తాకట్టుగా ఉంచిన తర్వాత లభించే నిధులను దాదాపు ఏ పనికైనా ఉపయోగించవచ్చు. ఈ నిధుల వినియోగానికి పరిమితులు ఉండవు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!