Gold Rate: పసిడి ధర పరుగులు 

బంగారం ధర మళ్లీ పెరిగింది. 10 గ్రాములపై పసిడిపై గురువారం రూ.237లు పెరిగింది. దీంతో దేశ రాజధాని నగరం దిల్లీలో 10 గ్రాముల పసిడి ...

Published : 20 May 2021 18:08 IST

న్యూదిల్లీ: బంగారం ధర మళ్లీ పెరిగింది. 10 గ్రాములపై పసిడిపై గురువారం రూ.237లు పెరిగింది. దీంతో దేశ రాజధాని నగరం దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.47,994కు చేరింది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ ఏర్పడటంతో ధరలు పెరిగినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. మరోవైపు, వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.71,421కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,874 డాలర్లు కాగా, వెండి ఔన్సు 27.80డాలర్లుగా ట్రేడవుతోంది. ఆసియాలో కరోనా కేసులు పెరుగుతున్నా.. డాలర్‌ బలపడినా బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ  సెక్యురిటీస్‌ సీనియర్‌ విశ్లేషకుడు తపన్‌ పటేల్‌ పేర్కొన్నారు.

ఇకపోతే, తాజా పెరుగుదలతో  హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.50వేలకు పైగా (అన్ని ట్యాక్సులతో కలిపి) ట్రేడ్‌ అవుతుండగా.. కిలో వెండి ధర 73,959గా ఉంది. బుధవారం పది గ్రాముల పసిడి ధర రూ.49,590 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని