Gold price: ఫెడ్‌ ఎఫెక్ట్‌.. పెరిగిన బంగారం ధర

Latest Gold rates: బంగారం ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. మేలిమి పసిడి ఒక్కరోజే రూ.770 మేర పెరిగింది.

Updated : 02 Feb 2023 18:16 IST

దిల్లీ: బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా ధర పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పసిడి (Gold) ధరలు గురువారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర (Gold rate) ఏకంగా రూ.770 మేర పెరిగి రూ.58,680కి చేరింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.57,910గా ఉంది.

దిల్లీలో సిల్వర్‌ (Silver) ధర కిలోకు రూ.1491 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.71,666కి చేరింది. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడం వల్లే దేశీయంగానూ వీటి ధరలకు రెక్కలు వచ్చాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1956 డాలర్లు, వెండి 24.15 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

అమెరికా ఫెడరల్‌ వడ్డీ రేట్ల పెంపే అంతర్జాతీయంగా పసిడి ధరల పెరుగుదల కారణమని అనలిస్టులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచుతూ అమెరికా ఫెడ్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మున్ముందూ పెంపు ఉంటుందని ఫెడ్‌ గవర్నర్‌ పావెల్‌ చెప్పారు. దీంతో బంగారానికి అనూహ్యంగా డిమాండ్‌ ఏర్పడింది. ఇవాళ వెలువడే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ పాలసీ నిర్ణయాలు సైతం బంగారం ధరలను ప్రభావితం చేయనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని