Gemini: భారత్‌కు గూగుల్‌ జెమిని యాప్‌.. తెలుగుతో సహా 9 భాషల్లో అందుబాటులోకి!

Gemini: గూగుల్‌ ఏఐ జెమిని మొబైల్‌ యాప్‌ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఏకంగా 9 భాషలకు సపోర్ట్‌ చేసేలా దీన్ని తీసుకొచ్చింది.

Updated : 18 Jun 2024 15:10 IST

Gemini | ఇంటర్నెట్‌డెస్క్‌: కృత్రిమ మేధ (AI) రంగంలో గూగుల్‌ దూసుకెళ్తోంది. గతేడాది చివర్లో జెమిని (Gemini AI) పేరుతో అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ను పరిచయం చేసింది. క్రమేణా పలు ఫీచర్లను జోడిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఏఐ అసిస్టెంట్‌ జెమిని మొబైల్‌ యాప్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ అప్లికేషన్ ప్రస్తుతం దేశంలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. 9 భాషలకు సపోర్ట్‌ చేసేలా దీన్ని రూపొందించింది.

‘‘జెమినిలో స్థానిక భాషలను జోడించాం. గూగుల్‌ మెసేజెస్‌లో కూడా జెమినీని వినియోగించుకోవచ్చు. రానున్న రోజుల్లో సరికొత్త ఫీచర్లను జోడించనున్నాం’’ అని ఆల్ఫాబెట్, గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ భాషల్లోనూ ఈ యాప్‌ సేవలందిస్తుందని గూగుల్‌ పేర్కొంది. అంటే మీకు నచ్చిన భాషలో జెమినీని యాక్సెస్‌ చేయొచ్చన్నమాట.

ఎస్‌బీఐ ఖాతా బ్యాలెన్స్‌.. సులువుగా తెలుసుకుందామిలా..

ఏదైనా అంశం గురించి సెర్చ్‌ చేయాలంటే టైప్‌ చేయొచ్చు. వాయిస్‌ అసిస్టెంట్‌ను ఉపయోగించొచ్చు. లేదా ఫొటో సాయంతో కూడా వెతికే సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే పరిమితమైన యాప్‌ రానున్న రోజుల్లో ఐఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుందని గూగుల్ పేర్కొంది. మరిన్ని అదనపు సదుపాయాల కోసం జెమిని అడ్వాన్స్‌ అనేది ప్రీమియం వెర్షన్‌. ఇందుకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఫైల్‌ అప్‌లోడ్‌, డేటా అనలైజ్‌ వంటి కొత్త ఫీచర్లు లభిస్తాయని గూగుల్‌ చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని