Google: 25 వసంతాల గూగుల్.. ప్రత్యేక డూడుల్‌ షేర్‌ చేసిన సెర్చ్‌ ఇంజిన్‌

గూగుల్ 25వ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక డూడుల్‌ని షేర్‌ చేసింది. ఇన్నేళ్లు తమతో కలిసి ప్రయాణించినందుకు ధన్యవాదాలు చెబుతూ.. భవిష్యత్తు ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నామని తెలిపింది.

Updated : 27 Sep 2023 12:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెర్చ్‌ఇంజిన్‌ అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చేది.. గూగుల్‌ (Google). ఆన్‌లైన్‌ షాపింగ్‌ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ వరకు, ఎడ్యుకేషన్‌ నుంచి ఎంప్లాయిమెంట్‌ వరకు ఎలాంటి సందేహమైనా గూగుల్‌లో వెతికేయొచ్చు. అలాంటి గూగుల్‌ స్థాపించి నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘G25gle’ అనే ప్రత్యేక డూడుల్‌ను షేర్‌ చేసింది.‘‘ భవిష్యత్తు కోసం గూగుల్ రూపుదిద్దుకుంది. పుట్టినరోజులు కేవలం కాలాన్ని మాత్రమే గుర్తుచేస్తాయి’’ అని పేర్కొంది. ఈ సందర్భంగా గూగుల్ ఎలా ఏర్పడిందో వివరించారు. 

‘గూగుల్‌ ఇంటర్వ్యూ ఎదుర్కోవడం ఎలా?’.. పిచాయ్‌ స్వయంగా సెర్చ్‌ చేసిన వేళ..!

‘‘90ల్లో లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌లు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌లో అనుకోకుండా కలిశారు. ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండటంతో.. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను ఎక్కువ మందికి చేరువ చేయాలనే ఆలోచనతో సెర్చ్‌ ఇంజిన్‌ అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమించారు. అలా, సెప్టెంబరు 27, 1998న గూగుల్‌ సంస్థను స్థాపించారు. 25 ఏళ్ల కాలంలో కేవలం గూగుల్‌ లోగోలు మాత్రమే మారాయి. కానీ, ప్రజలకు సమాచారాన్ని చేరువచేయాలన్న మా సంకల్పం మాత్రం మారలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తమ అవసరాల కోసం గూగుల్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఎంతో గొప్ప విషయం. 25 ఏళ్లపాటు మాతో కలిసి ప్రయాణించినందుకు ధన్యవాదాలు.. భవిష్యత్తు ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నాం’’ అని గూగుల్ డూడుల్ పేజ్‌లో రాసుకొచ్చింది. నిజానికి గూగుల్‌ బీటా వెర్షన్‌ సెప్టెంబరు 6, 1998న ప్రారంభం కావడంతో, దాన్ని కూడా గూగుల్ పుట్టినరోజుగా పేర్కొంటుంది. కానీ, అధికారికంగా గూగుల్ బర్త్‌డేని సెప్టెంబరు 27న నిర్వహిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని