Archana Gulati: గూగుల్ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ రాజీనామా!
టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా(Google India) ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్ అర్చన గులాటీ(Archana Gulati) తన పదవికి రాజీనామా చేశారు. అయిదు నెలల క్రితమే...
దిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా(Google India) ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్ అర్చన గులాటీ(Archana Gulati) తన పదవికి రాజీనామా చేశారు. అయిదు నెలల క్రితమే ఆమె ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. అయితే, తన పదవికి ఎందుకు రాజీనామా చేశారో తెలియరాలేదు. సంస్థతోపాటు ఆమె సైతం ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గూగుల్‌పై భారత్‌లో యాంటీ ట్రస్ట్ కేసులు, కఠినమైన టెక్- సెక్టార్ నిబంధనలు ఎదురవుతోన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందిన గులాటీ.. ఐఐటీ దిల్లీ నుంచి నుంచి పీహెచ్డీ చేశారు. టెలికాం శాఖలో, కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి 2021 వరకు ‘నీతి ఆయోగ్’లో జాయింట్ సెక్రెటరీ(డిజిటల్ కమ్యూనికేషన్స్)గానూ పనిచేశారు. ఆపై స్వచ్ఛంద విరమణ తీసుకుని.. ఏడాది పాటు ఫ్రీలాన్స్ చేశారు. ఈ ఏడాది మే నెలలో గూగుల్ ఇండియాలో చేరారు. ఇదిలా ఉండగా.. గులాటీ గతంలో పనిచేసిన సీసీఐ.. దేశంలోని స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ వ్యవస్థ విపణిలో అనైతిక వ్యాపార పద్ధతులు పాటిస్తోందన్న ఆరోపణలపై గూగుల్‌పై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Yuvagalam: నాడు అధినేత.. నేడు యువ నేత
-
Movies News
Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు