Samsung: శాంసంగ్ ఫోన్లలో ఇక గూగుల్ స్థానంలో బింగ్..?
Samsung: బింగ్ నుంచి గూగుల్‌కు ఇటీవల గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ తరుణంలో శాంసంగ్ డిఫాల్ట్ సెర్చింజన్‌గా బింగ్‌ను అందించాలని యోచిస్తోంది. ఇది గూగుల్ ఆదాయానికి భారీగా గండి కొట్టే అవకాశం ఉంది.
వాషింగ్టన్: తమ ఎలక్ట్రానిక్ పరికరాల్లో గూగుల్ (Google) స్థానంలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చింజన్ బింగ్ (Bing)ను ప్రవేశపెట్టాలని శాంసంగ్ (Samsung) యోచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల గూగుల్ (Google) దాదాపు మూడు బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని అంచనా. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికాలో ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఓ కథనం ప్రచురించింది.
బింగ్ (Bing) నుంచి గూగుల్ (Google)కు ఇటీవల గట్టిపోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ సాంకేతికతను బింగ్ (Bing) సెర్చ్‌కు అదనపు ఫీచర్‌గా జత చేసిన తర్వాత అది మరింత తీవ్రమైంది. ‘ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్’ వివరాల ప్రకారం.. 2022లో శాంసంగ్ (Samsung) 26.1 కోట్ల స్మార్ట్‌ఫోన్లను సరఫరా చేసింది. ఇవన్నీ గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ (Google)తో సుదీర్ఘకాలంగా భాగస్వామ్యం కొనసాగిస్తున్న శాంసంగ్.. తమ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో రెండు కంపెనీలకు చెందిన యాప్‌లు, సేవలను ముందుగానే ఇన్‌స్టాల్ చేసి వినియోగదారులకు అందిస్తోంది. తాజాగా బింగ్ (Bing)ను డిఫాల్ట్ సెర్చింజన్‌గా ఇవ్వడంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతానికైతే ఇంకా కొంతకాలం గూగుల్ (Google)నే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు బింగ్ (Bing) నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు గూగుల్ (Google) సైతం సిద్ధమవుతోంది. సెర్చింజన్‌కు కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లను జత చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ప్రత్యేకంగా 160 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల