Google: ఇకపై గూగుల్ మెసేజ్‌లోనూ గ్రూప్ చాట్స్!
గూగుల్ మెసేజెస్‌లో మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సాప్ గ్రూప్ చాట్ తరహాలో ఈ ఫీచర్ పనిచేస్తుంది. దీనికి కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుందని గూగుల్ చెబుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ (Google) కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు పరిచయం చేయనుంది. వాట్సాప్ (WhatsApp) గ్రూప్ చాట్ తరహాలోనే గూగుల్ మెసేజెస్ (Google Messages)లో కూడా గ్రూప్ చాట్ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వీటికి కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుందని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. పరీక్షల అనంతరం సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ చెబుతోంది.
గూగుల్ మెసేజెస్‌లోని గ్రూప్ చాట్ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అనే బ్యానర్‌తో కనిపిస్తుంది. మెసేజ్ టైప్ చేసిన తర్వాత సెండ్ బటన్ స్థానంలో లాక్ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మెసేజ్ అవతలి వారికి వెళుతుంది. ఈ సంభాషణలు రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) ద్వారా జరుగుతాయని తెలిపింది. దీంతో సెండర్, రిసీవర్ మినహా ఇతరులెవరూ సంభాషణలను చదవలేరని గూగుల్ చెబుతోంది. ఈ ఫీచర్‌తోపాటు గూగుల్ మెసేజెస్‌లో ఎమోజీ రియాక్షన్ ఫీచర్‌ను కూడా పరిచయం చేయనుంది. దీంతో యూజర్లు ఇతరులు పంపిన మెసేజ్‌లకు ఎమోజీలతో తమ స్పందన తెలియజేయొచ్చు.
గూగుల్ వేర్ ఓఎస్‌తో పనిచేస్తున్న స్మార్ట్‌వాచ్‌లకు సంబంధించి కీలక అప్‌డేట్‌ను కంపెనీ విడుదల చేసింది. దీంతో యూజర్లు స్మార్ట్‌వాచ్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేయకుండా.. గూగుల్ మ్యాప్స్ సేవలను వాచ్‌లోనే పొందొచ్చు. ఇది కేవలం ఎల్‌టీఈ కనెక్టివిటీ, ఈ-సిమ్ సపోర్ట్ ఉన్న స్మార్ట్‌వాచ్‌లలో మాత్రమే పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది. అంతేకాకుండా జీమెయిల్‌లో వెబ్ వెర్షన్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Polavaram: పోలవరం ఎత్తుపై కేంద్రం భిన్న ప్రకటనలు!
-
General News
TTD: నడిచి వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లు.. తితిదే ఛైర్మన్
-
Crime News
UP: గ్యాంగ్‌స్టర్ తరలింపులో ఉత్కంఠ.. ఆవును ఢీకొన్న కాన్వాయ్..!
-
General News
Andhra news: రావాల్సిన డబ్బులే అడుగుతుంటే.. కాకిలెక్కలు చెబుతున్నారు: బొప్పరాజు
-
Politics News
KTR: తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోంది: మంత్రి కేటీఆర్
-
Movies News
Samantha: ‘సామ్.. మళ్లీ ప్రేమలో పడొచ్చుగా..!’ నెటిజన్ ట్వీట్‌కు సామ్ సమాధానం ఏమిటంటే..?