Pixel Fold: గూగుల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. ఎలా ఉందో చూశారా?
Pixel Fold: గూగుల్ తమ తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రకటించింది. పిక్సెల్ ఫోల్డ్ పేరిట తీసుకొస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించిన వీడియో టీజర్‌ను విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ రాబోతోందంటూ గతకొంత కాలంగా ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎట్టకేలను అవి నిజమేనని గూగుల్ ధ్రువీకరించింది. పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) పేరిట మడతపెట్టే ఫోన్‌ను తీసుకురానున్నట్లు గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.
పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) ఫోన్ ఎలా ఉండనుందో చూపిస్తూ ఓ వీడియో టీజర్‌ను గూగుల్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మే 10 నుంచి ప్రారంభం కానున్న వార్షిక సమావేశం ‘I/O 2023’లో వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold)తో పాటు పిక్సెల్ 7ఏ స్మార్ట్‌ఫోన్, పిక్సెల్ ట్యాబ్లెట్‌ను సైతం పరిచయం చేయనుంది.
పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold)కు సంబంధించిన వీడియో టీజర్ నిడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. ఫోన్‌కు సంబంధించిన చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. ఫోన్ డిజైన్, హింజ్ సపోర్ట్, తెర, సాఫ్ట్‌వేర్, వెనుక మూడు కెమెరాలు, ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా కచ్చితమైన స్పెసిఫికేషన్లు తెలియాలంటే మే 10 వరకు ఆగాల్సిందే.
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఊహాగానాల ప్రకారం.. పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) టెన్సర్ జీ2 ప్రాసెసర్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఇదే ప్రాసెసర్ ఇప్పటికే పిక్సెల్ 7, పిక్సెల్ 7ప్రొ స్మార్ట్‌ఫోన్లలో ఉంది. 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సెల్ఫీల కోసం ఔటర్ డిస్‌ప్లేపై 9.5 మెగాపిక్సెల్, ఇన్నర్ డిస్‌ప్లేపై 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్
-
Chandrababu: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్
-
భాజపా ఎమ్మెల్యే నివాసంలో యువకుడి ఆత్మహత్య: ప్రియురాలితో గొడవే కారణం