Google Podcasts: పాడ్‌కాస్ట్స్‌కు గూగుల్‌ గుడ్‌బై.. కారణం ఇదే..!

Google: ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ తన పాడ్‌కాస్ట్‌ అప్లికేషన్‌ సేవలన్ని వచ్చే ఏడాది నాటికి తొలగించనున్నట్లు ప్రకటించింది.

Published : 28 Sep 2023 02:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google) తన పాడ్‌కాస్ట్స్‌ (Podcasts) సర్వీసులకు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది (2024) నుంచి ఈ అప్లికేషన్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై యూట్యూబ్‌ మ్యూజిక్‌ (YouTube Music)లోనే ఈ ఫీచర్‌ను అందించనుంది. అంటే పాడ్‌కాస్ట్‌ సేవలు పొందాలంటే యూట్యూబ్‌ మ్యూజిక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మైగ్రేషన్‌ టూల్స్‌ను సిద్ధం చేసి, ఏడాది చివరి నాటికి పాడ్‌కాస్ట్స్‌ సర్వీసును పూర్తిగా మూసివేయనుంది.

యూపీఐ ఎఫెక్ట్‌.. రూపే కార్డులకు భలే డిమాండ్‌..!

‘వచ్చే ఏడాదిలో యూట్యూబ్‌ మ్యూజిక్‌ పాడ్‌కాస్ట్‌లపై మా పెట్టుబడులు పెంచనున్నాం. యూట్యూబ్‌ మ్యూజిక్‌లోనే ఈ పాడ్‌కాస్ట్‌లు వినియోగించే వారికి మెరుగైన సేవలందిస్తాం. అమెరికాలో వీక్లీ పాడ్‌కాస్ట్‌లు వినే వారిలో దాదాపు 23 శాతం మంది యూట్యూబ్‌నే ఎంచుకుంటున్నారు. ఇక గూగుల్‌ పాడ్‌కాస్ట్‌ను కేవలం 4 శాతం మాత్రమే వినియోగిస్తున్నారు’ అని గూగుల్‌ తన బ్లాగ్‌లో తెలిపింది. రానున్న ఏళ్లలో యూట్యూబ్‌ మ్యూజిక్‌లోని విస్తృత సామర్థ్యాలను ఉపయోగించి వీక్షకులకు, క్రియేటర్లకు మెరుగైన పాడ్‌కాస్టింగ్ అనుభవాన్ని అందించటమే ఈ వ్యూహాత్మక మార్పు లక్ష్యం అని తెలిపింది. ఇప్పటికే పెయిడ్‌ మెంబర్‌షిప్‌ లేకుండా యూట్యూబ్‌ మ్యూజిక్‌ ఆనందించే సదుపాయాన్ని అమెరికాలో గూగుల్‌ తీసుకొచ్చింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని