Google: గూగుల్ ఉద్యోగులకు స్నాక్స్ బంద్.. ఇతర ప్రోత్సాహకాలూ కట్!
Google: ఉద్యోగులకు ఇచ్చే చిన్న చిన్న ప్రోత్సాహకాలను సైతం గూగుల్ ఆపేసింది. వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.
వాషింగ్టన్: ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో గూగుల్ (Google) ఎప్పుడూ ముందుంటుంది. అయితే, ఇప్పుడు అవన్నీ కంపెనీకి భారంగా మారాయి. ఇకపై ఉద్యోగులకు ఇచ్చే చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, కంపెనీ మధ్యాహ్న భోజనాల వంటి వాటిని ఆపేయాలని గూగుల్ నిర్ణయించింది. వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కంపెనీ ‘ప్రధాన ఆర్థిక అధికారి (CFO)’ రుత్ పోరట్ ఉద్యోగులకు లేఖ రాశారు.
మరోవైపు ఖర్చులను తగ్గించుకోవడం కోసం కొత్త ఉద్యోగుల నియామకాలను సైతం నిలిపివేస్తున్నట్లు పోరట్ పేర్కొన్నారు. ప్రాధాన్యానికి అనుగుణంగా.. ఉన్న వనరుల్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. అందులో భాగంగా కొంత మంది ఉద్యోగులను ఇతర పనుల్లోకి బదిలీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్‌ల కొనుగోలును సైతం తగ్గించనున్నట్లు చెప్పారు. అయితే, ఈ ప్రోత్సాహకాల కుదింపు ఆఫీసులు ఉన్న ప్రాంతాలు.. అక్కడ ఉండే వసతులను బట్టి మారుతుందని స్పష్టం చేశారు. వ్యయ నియంత్రణలో భాగంగా ఇప్పటికే గూగుల్ (Google) భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించింది. ఇటీవలే 12,000 మందిని ఇంటికి పంపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి
-
IAF: వాయుసేన హెలికాప్టర్లో సాంకేతిక లోపం.. పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
-
KTR: బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు: కేటీఆర్
-
Turkey: తుర్కియే పార్లమెంట్ వద్ద ఆత్మాహుతి దాడి
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్