Tax Exemption: కొవిడ్ చికిత్సకు డబ్బు అందిందా..? పన్ను మినహాయింపు పొందండిలా..
కొవిడ్-19 చికిత్సకు అందిన ఆర్థిక సాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది....
Tax Exemption: కొవిడ్-19 (Covid-19) బారిన పడిన ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యుల చికిత్సకు కొన్ని కంపెనీలు ఆర్థిక సాయం చేశాయి. మరికొన్ని సందర్భాల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందజేశాయి. అలాగే కొందరు వ్యక్తులు, బంధువులు, ఇతర సన్నిహితులు కూడా సాయం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇలా అందిన మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు (Tax Exemption) ఉంటుంది. దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు, ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను ‘కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT)’ ఇటీవల విడుదల చేసింది. వాస్తవానికి ప్రభుత్వం ఈ వెసులుబాటును 2021 జూన్ 25లోనే ప్రకటించింది. బడ్జెట్ 2022లో దీన్ని నోటిఫై కూడా చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని వర్తింపజేస్తామని తాజా ఉత్తర్వుల్లో సీబీడీటీ పేర్కొంది. పన్ను మినహాయింపు కోరే ఉద్యోగులు ముందుగా కంపెనీలకు ఈ కింది పత్రాలను సమర్పించాలని సీబీడీటీ పేర్కొంది.
> ఉద్యోగిగానీ లేదా కుటుంబ సభ్యులకుగానీ కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ధ్రువీకరించే మెడికల్ సర్టిఫికెట్.
> కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత ఆరు నెలలోపు దానికి సంబంధించి తీసుకున్న చికిత్స, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు చెందిన అన్ని వైద్యపత్రాలు.
> కొవిడ్-19 సంబంధిత చికిత్సకు అయిన ఖర్చును ధ్రువీకరించే పత్రం.
వీటిని కంపెనీలో సమర్పించడంతో పాటు వ్యక్తిగతంగానూ ఓ కాపీని ఎప్పుడూ దగ్గర భద్రపరచుకోవాలని సీబీడీటీ సూచించింది. మరోవైపు ఫారం-1ని ఆదాయపు పన్ను విభాగానికి ఇవ్వాలని సీబీడీటీ స్పష్టం చేసింది. నగదు చేతికి అందిన తొమ్మిది నెలలోపుగానీ లేదా 2022 డిసెంబరు 31 వరకు గానీ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించింది.
ఫారం-1 ప్రకారం ఉద్యోగులు ఈ కింది వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి ఇవ్వాల్సి ఉంటుంది.
- పేరు, చిరునామా, పాన్
- తేదీ, సీరియల్ నెం/ఐడీ నెంబరుతో కూడిన కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ పరీక్షల వివరాలు
- ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయిన ఆరు నెలల్లోపు అందిన చికిత్సకు సంబంధించిన వివరాలు
- సరైన పత్రాలతో కూడిన వైద్య ఖర్చు వివరాలు
- చికిత్సకు అందిన నగదు మొత్తం
- సాయం అందించిన వ్యక్తి పేరు, చిరునామా, పాన్ వివరాలు
- ఏ ఆర్థిక సంవత్సరంలో నగదు సాయం అందింది?
ఫారం-1లో ఈ వివరాలు పొందుపర్చిన తర్వాత తగిన పత్రాలను కూడా ఆదాయపు పన్ను విభాగానికి అందించాల్సి ఉంటుంది. ఒకవేళ కొవిడ్-19 బారిన పడిన వ్యక్తి మరణించిన అనంతరం కుటుంబ సభ్యులకు నగదు సాయం అందినా.. ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఆరునెలల్లోపు మరణించి ఉన్నట్లయితేనే.. పన్ను ప్రయోజనాలు అందుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
రుషికొండపై చకచకా పనులు
-
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం.. క్రికెట్ సహా 3 పతకాలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
24సార్లు వినతిపత్రాలు ఇచ్చినా.. వందల సార్లు ఫిర్యాదుచేసినా..!
-
Tirumala Brahmotsavam: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
-
రాత్రివేళ రెండేళ్ల పాప అదృశ్యం.. డ్రోన్లు, జాగిలాలతో పోలీసుల జల్లెడ