CNG Price hike: CNG రేట్లను స్వల్పంగా పెంచిన కేంద్రం.. ఇవాళ్టి నుంచే అమలు

సీఎన్‌జీ ధరలను స్వల్పంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.

Updated : 22 Jun 2024 20:29 IST

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోవడంతో చాలా మంది కంప్రెస్‌డ్‌ నేచురల్ గ్యాస్‌ (CNG)తో నడిచే వాహనాలవైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో వీటి వాడకం కూడా ఎక్కువైంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేజీ సీఎన్‌జీపై రూ.1 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. 

నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌), దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దిల్లీలో ప్రస్తుతం కేజీ సీఎన్‌జీ ధర రూ.74.09 నుంచి రూ.75.09కి పెరిగింది. గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌లో రూ.78.70 నుంచి 79.70కి  చేరింది. సీఎన్‌జీతో నడిచే ఆటోలు, టాక్సీలు, వ్యక్తిగత వాహనదారులపై కొంత భారం పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని