Published : 25 May 2022 18:01 IST

Hindustan Zinc: హిందూస్థాన్‌ జింక్‌లో వాటాల విక్రయానికి కేబినెట్‌ ఆమోదం!

ప్రభుత్వానికి రూ.38,560 కోట్ల ఆదాయం

ముంబయి: పెట్టుబడుల ఉపసంహరణ (disinvestment) ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇటీవలే ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా దాదాపు రూ.21 వేల కోట్లు సమీకరించింది. తాజాగా హిందూస్థాన్ జింక్‌ (Hindustan Zinc)లో ఉన్న 29.5 శాతం వాటాలను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. దీనికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం కూడా లభించినట్లు సమాచారం. ఈ మొత్తం వాటాను ప్రభుత్వం రూ.38,560 కోట్లకు విక్రయించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ‘పెట్టుబడుల ఉపసంహరణ, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (DIPAM)’ ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది.

హిందూస్థాన్‌ జింక్‌ (Hindustan Zinc)లో తొలుత ప్రభుత్వం 2002లో 26 శాతం వాటాను వేదాంత స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌కు విక్రయించింది. తర్వాత 2003లో అదే సంస్థ మరో 19 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2009లో వాటాదారుల పర్చేజ్‌ అగ్రిమెంట్‌ ప్రకారం కంపెనీ కాల్‌ ఆప్షన్‌కు వెళ్లింది. దీన్ని ప్రభుత్వం వ్యతిరేకించింది. దీంతో వేదాంత ప్రభుత్వ చర్యలను సవాల్‌ చేస్తూ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆ వ్యాజ్యాన్ని కంపెనీ వెనక్కి తీసుకుంది. దీంతో మిగిలిన 1.24 బిలియన్‌ షేర్లను విక్రయించడానికి ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం వేదాంతకు కంపెనీలో 64.9 శాతం వాటాలున్నాయి. ప్రస్తుత షేరు ధరల్ని బట్టి కంపెనీ మరో 5 శాతం వాటాలను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉందని కంపెనీ ఇటీవల తెలిపింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని