Edible oil prices: తగ్గనున్న వంట నూనెల ధరలు

Edible oil prices: దేశీయంగా వంట నూనెల ధరలు తగ్గనున్నాయి. లీటర్‌కు రూ.8-12 మేర తగ్గించాలని కేంద్రం ఆయా కంపెనీలకు సూచించింది. 

Published : 02 Jun 2023 19:33 IST

దిల్లీ: దేశీయ మార్కెట్‌లో వంట నూనెల ధరలు (Edible oil prices) తగ్గుముఖం పట్టనున్నాయి. నూనెల ధరలు తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం వంట నూనెల పరిశ్రమలకు సూచించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఒక్కో లీటర్‌కు రూ.8-12  వరకు తగ్గించాలని పేర్కొంది. ఈ మేరకు పరిశ్రమ వర్గాలతో జరిగిన సమావేశంలో నూనెల ధరలు తగ్గించాలని సూచించినట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా తెలిపారు.

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులతో పాటు ఇన్‌పుట్‌, రవాణా వ్యయాలు పెరగడంతో 2021-22లో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. అయితే, అంతర్జాతీయంగా 2022 జూన్‌ నుంచి ఈ ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. అందుకు అనుగుణంగా దేశీయంగా వంట నూనెల ధరలు తగ్గాయి. అయితే, అంతర్జాతీయ ధరలు తగ్గినంత వేగంగా దేశీయంగా ధరలు తగ్గడం లేదని కేంద్రం అభిప్రాయపడింది. కాబట్టి తక్షణమే ధరలు తగ్గించాలని పరిశ్రమ వర్గాలకు సూచించింది. లీటర్‌కు రూ.8-12 మేర తగ్గించాలంది. త్వరలోనే వంటనూనెల ధరలు తగ్గుతాయని, దీంతో ద్రవ్యోల్బణ భయాలు సైతం తగ్గుతాయని ఆహార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై పరిశ్రమ వర్గాలు సైతం సానుకూలంగా స్పందించాయి. ఇదే సమావేశంలో ప్రైస్‌ డేటా కలెక్షన్‌, వంట నూనెల ప్యాకేజీ తదితర అంశాలు చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని