SEZ Units: పసిడి ఆభరణాలపై దిగుమతి ఆంక్షలు ఎస్‌ఈజెడ్‌లకు వర్తించవు: డీజీఎఫ్‌టీ

కొన్ని రకాల పసిడి ఆభరణాల దిగుమతిపై ఆంక్షలు విధించాలన్న తమ నిర్ణయం ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజెడ్‌ల)లోని యూనిట్లకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Published : 21 Jun 2024 03:10 IST

దిల్లీ: కొన్ని రకాల పసిడి ఆభరణాల దిగుమతిపై ఆంక్షలు విధించాలన్న తమ నిర్ణయం ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజెడ్‌ల)లోని యూనిట్లకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్‌ 11న, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం, ఇండోనేషియా, టాంజానియా వంటి దేశాల నుంచి పసిడి ఆభరణాల దిగుమతులను కట్టడి చేసేందుకు పరిమితులు విధించింది. సెజ్‌ యూనిట్లు (స్వేచ్ఛా వాణిజ్య వేర్‌హౌసింగ్‌ జోన్‌లు మినహా) చేసే దిగుమతులు.. ఈ నోటిఫికేషన్‌ పరిధిలోకి రావని డీజీఎఫ్‌టీ తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. 2023-24లో ఎస్‌ఈజెడ్‌ల నుంచి ఎగుమతులు 4% పెరిగి 163.69 బిలియన్‌ డాలర్ల (రూ.13.5 లక్షల కోట్ల)కు చేరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆమోదించిన అలాంటి జోన్లు 423 ఉండగా, 2024 మార్చి 31 నాటికి 280 కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2023 డిసెంబరు 31 నాటికి 5,711 యూనిట్లు ఈ జోన్లలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని