windfall tax: క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ తగ్గింపు

క్రూడాయిల్‌పై కేంద్రం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ తగ్గించింది. అలాగే, ఇంధన ఎగుమతులపై సుంకాన్నీ సవరించింది.

Published : 17 Jan 2023 18:02 IST

దిల్లీ: దేశీయంగా చమురు ఉత్పత్తి చేసే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధించే విండ్‌ఫాల్‌ (windfall tax) ట్యాక్స్‌తో పాటు డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపైనా సుంకాలను తగ్గించింది. తాజా సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఓఎన్‌జీసీ (ONGC) వంటి సంస్థలు ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌పై విండ్‌ ఫాల్‌ ట్యాక్స్‌ను టన్నుకు రూ.2100 నుంచి రూ.1,900 తగ్గించారు. లీటరు డీజిల్‌పై ఉన్న ఎగుమతి సుంకాన్ని రూ.6.5 నుంచి రూ.5కు తగ్గించారు. అదే విధంగా విమాన ఇంధన ధర (ATF)పై ఇంతకుముందు లీటరుకు రూ.4.5గా ఉన్న పన్నును లీటరుకు రూ.3.5 తగ్గించారు. కొత్త పన్నులు జనవరి 17 నుంచి అమల్లోకి వచ్చాయి.

చమురు సంస్థలు అధిక లాభాలను ఆర్జిస్తున్న నేపథ్యంలో కేంద్రం విండ్‌పాల్‌ ట్యాక్స్‌ని 2022 జులై1న ప్రవేశపెట్టింది. డీజిల్ ఎగుమతులపై లీటరు రూ.6 చొప్పున, పెట్రోల్, విమాన ఇంధన ధర లీటరు రూ.13 సుంకాన్ని విధించింది. దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడిచమురుపై టన్నుకు రూ.23,250 చొప్పున విండ్‌పాల్‌ పన్నును విధించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల సగటు అనుగుణంగా ప్రతి 15 రోజులకొకసారి పన్నును సమీక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని