Axis bank: యాక్సిస్‌ బ్యాంకు వాటాల విక్రయం.. ప్రభుత్వ ఖజానాకు ₹3,839 కోట్లు

ప్రైవేటు రంగ బ్యాంక్‌ యాక్సిస్‌లో వాటాల విక్రయం ద్వారా రూ.3,839 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సమకూరాయి.

Published : 16 Nov 2022 23:31 IST

దిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంక్‌ యాక్సిస్‌లో వాటాల విక్రయం ద్వారా రూ.3,839 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖజానాలో చేరాయి. యాక్సిస్‌లో తనకు ఉన్న 1.55 శాతం వాటాకు సమానమైన 4.65 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ఈ మొత్తం సమకూరింది. స్పెసిఫైడ్‌ అండర్‌టేకింగ్‌ ఆఫ్‌ ద యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (సూటి) ద్వారా ఉన్న వాటాలను ప్రభుత్వం పూర్తిగా విక్రయించింది. అంటే యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలిగింది.

యాక్సిస్‌లో ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.830.63 చొప్పున మొత్తం రూ.3,839 కోట్లు వచ్చినంట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. బీఎస్‌ఈలో బుధవారం  యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు విలువ స్వల్పంగా క్షీణించి రూ.854.65 వద్ద ముగిసింది. ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. యాక్సిస్‌లో వాటా విక్రయం వచ్చిన మొత్తంలో కలిపి ఇప్పటి వరకు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం రూ.28,383 కోట్లు ఆర్జించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని