Budget 2023: బడ్జెట్‌లో అంకుర సంస్థలకు మరింత అండ!

Budget 2023: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై వివిధ రంగాలు తమ అభిప్రాయాలు, అంచనాలను వెల్లడిస్తున్నాయి.

Published : 26 Jan 2023 22:25 IST

దిల్లీ: దేశంలో అంకుర సంస్థల (startup)కు మరింత ప్రోత్సాహకర వాతావరణ కల్పించేందుకు రాబోయే బడ్జెట్‌ (Budget 2023)లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని పారిశ్రామిక వర్గాలు ఆశిస్తున్నాయి. అలాగే దేశీయంగా తయారీ రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగానూ చర్యలు ఉండొచ్చని తెలుస్తోంది ‘ఉత్పత్తి అనుసంధానిత పథకం (PLI)’లో భాగంగా మరికొన్ని రంగాలకూ ఆర్థిక ప్రోత్సాహకాలను విస్తరించే అవకాశం ఉందని తెలిపాయి. 2023 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

పీఎం గతి శక్తి యోజన కింద ఏర్పాటు చేసిన ‘నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ (NPG)’ ఆమోదించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కేటాయించడాన్నీ కేంద్రం పరిగణనలోకి తీసుకోవచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేశాయి. రవాణా సంబంధిత వ్యయాలను తగ్గించడం కోసం సమీకృత మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా 2022 అక్టోబర్ 13న ప్రధాని నరేంద్ర మోదీ గతిశక్తిని యోజనను ప్రారంభించిన విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి అనేక పథకాలను తీసుకొచ్చింది. వివిధ దశల్లో ఉన్న స్టార్టప్‌లకు నిధులను సమకూర్చేందుకు ‘ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఫర్‌ స్టార్టప్స్‌ (FFS)’, ‘స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీమ్‌ (SISFS)’, ‘క్రెడిట్‌ గ్యారెంటీ స్కీం ఫర్‌ స్టార్టప్స్‌ (CGSS)’ల పేరిట ‘స్టార్టప్‌ ఇండియా’ అనే పథకాన్ని అమలు చేస్తోంది. అంకుర సంస్థల్లో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం తాజా బడ్జెట్‌లో మరిన్ని చర్యల్ని పొందుపర్చాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది.

బడ్జెట్‌పై మరిన్ని కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు